AB Venkateswara rao: కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన ఏబీ వెంకటేశ్వరరావు
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Andhra Pradesh: హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం, అలవెన్స్‌లు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ధర్మాసనం విచారణ జరపగా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి మాత్రమే పూర్తి జీతం ఇచ్చారని, పాత బకాయిలు చెల్లించలేదని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ కు 15కు వాయిదా వేసింది.
నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఐసీఎస్ అధికారి ఏబీ వెంకటేవ్వరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. దాని మీద జోక్యం చేసుకోవడానికి కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ సంబంధిత జీవోను కొట్టివేస్తూ హైకోర్టు 2020మే 22న తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న కొట్టి వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22 నుంచి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.