Ice Apple: వేసవి డీహైడ్రేషన్‌ కి తాటి ముంజలతో చెక్ పెట్టండి

వేసవి వచ్చిదంటే తాటి ముంజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నీటి ముంజలు, తాటి ముంజలు, పాల ముంజలు.. ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు.

Ice Apple: వేసవి వచ్చిదంటే తాటి ముంజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నీటి ముంజలు, తాటి ముంజలు, పాల ముంజలు.. ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు. దీనినే ఐస్ యాపిల్ అని కూడా అని కూడా అంటారు. వేసవిలో విరివిగా దొరుకుతాయి. ఈ తాటి ముంజల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు కాల్షియం, ఫైటో న్యూట్రియంట్స్ , విటమిన్నలు పుష్కలంగా లభిస్తాయి. తాటి ముంజలతో డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. బరువును అదులో ఉంచుతాయి. వాంతులు, వికారం లక్షణాలు ఉన్నప్పుడు తాటి ముంజలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు చర్మానికి సంబందించిన అద్భుతాలు చేయడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి.

 

రోగనిరోధక శక్తి బలోపేతం (Ice Apple)

డయాబెటిక్ ఉన్నవాళ్లు తాటి ముంజలు తినే విషయంలో ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇందులోని పోషకాల కారణంగా ఆరోగ్యకరమైన బలమైన రోగనిరోధక వ్యవస్థని అందిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సి, బి7 పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు పెంచకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలని నివారిస్తుంది.

ఐస్ యాపిల్ అత్యధికంగా నీటిని కలిగి ఉంటుంది, పొట్ట నిండుగా ఉంచడం వల్ల అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ. డైటరీ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఫైటోన్యూట్రియెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు తాటి ముంజలు సహాయపడతాయి. యాంటీ ఏజింగ్ ను తగ్గిస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకోవడంతో పాటు ముఖం మెరిసేలా చేస్తుంది. వేసవిలో వచ్చే దద్దుర్లు వంటి చర్మ సమస్యలను తాటి ముంజలు తినడం వల్ల దూరం చేసుకోవచ్చు.

 

జట్టు పొడి బారకుండా

దురద, చికాకు నుంచి ఉపశమనం పొందటం కోసం ఐస్ యాపిల్స్ ఉపయోగపడతాయి. చర్మం పై దురద ఉన్న ప్రాంతంలో తాజి ముంజలతో రాయడం వల్ల దురద సమస్య తగ్గుతుంది. చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.

తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది. జుట్టుని బలంగా మార్చి నేచురల్ కండిషనర్ గా పని చేస్తుంది. జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి.

తాటి ముంజల్లో ఔషద గుణాలు ఉన్నాయి. లివర్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయనేది నిపుణుల మాట. వీటిలో ఉండే పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇవి అద్భుతమైన ఆహారం. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి.. మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.