Tea Biscuits: మన దేశంలో టీ అనేది ఒక డ్రింక్ కాదు, ఇదొక ఎమోషన్. టీ తాగనిదే రోజుగడవదు అన్నట్టు అనుకుంటారు చాలా మంది టీ లవర్స్. టీ సువాసన చూస్తూ చాలు మనస్సుకు ఎక్కడలేని హాయి కలుగుతుంది. ఉదయమైనా, సాయంత్రమైనా అందులోనూ వాతారవణం చల్లగా ఉంటే చాలు ఓ కప్పు టీ పడాల్సిందే. అలా చల్లచల్లని వాతావరణం వేడివేడి టీ తాగుతుంటే అబ్బా ఆ సుఖమే వేరే లెవల్ అంతే. కొందమంది టీని నిద్ర మత్తు వదిలించే మెడిసిన్‌లా.. మరికొందరు శరీర బద్ధకం వదిలించి యాక్టివ్‌గా మార్చే ఎనర్జీ బూస్టర్‌గా భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి టీ తాగే స్పెషల్ స్టైల్ కచ్చితంగా ఉంటుంది. కొంతమంది టీ తోపాటు బిస్ట్కెట్స్ తింటూ ఉంటారు. మరికొందరు ఏమైనా స్పెసీ ఫ్రైయిడ్ స్నాక్స్ ని తీసుకుంటారు. అయితే ఎక్కువమంది ఇష్టపడేది మాత్రం ఛాయ్ బిస్కెట్ కాంబినేషన్ అనే చెప్పాలి. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి హాని చేస్తుందని డైటీషియన్స్. మరి టీతో బిస్కెట్లు తీసుకుంటే వచ్చే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనారోగ్యానికి చాలా ముప్పు(Tea And Biscuits)
టీతో పాటు బిస్కెట్లు తింటే.. బీపీ పెరుగతుందని, హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే ముప్పు ఉందని ఆహార నిపుణులు చెప్తున్నారు. బిస్కెట్లలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్ ముప్పు పెంచుతుంది. గుండె సమస్యలు, గుండె పోటు రావడానికి కారణం అవుతుంది.
బిస్కెట్ తయారీకి చక్కెర ఎక్కువగా వాడుతుంటారు, టీలోనూ చక్కెర ఉంటుంది. అధికంగా చక్కెర తీసుకుంటే.. ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్లను ప్రేరిపితం చేస్తుంది అంతేకాకుండా ఆ హార్మోన్ల అసమతుల్యత ద్వారా డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. మరోవైపు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియను పాడు చేస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు.
బిస్కెట్లు ప్రాసెస్ చేసిన ఆహారం కనుక.. వీటిలో డీఎన్ఏను దెబ్బతిసే బీహెచ్ఏ, బీహెచ్టీ ఉంటుంది. దీనిలో హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కూడా ఉండడం వల్ల శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతుకు దారితీస్తుంది.