Site icon Prime9

Winter Tips : చలికాలం లో ఈ ఆహారం తీసుకుంటే ఇంకా అంతే .. ఏం అవ్వుద్దో ఇప్పుడే తెలుసుకోండి .

winter- healthy food tips

winter- healthy food tips

Winter Tips : చలి కాలం వచ్చేసింది , వాతావరణం చల్లబడుతుంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. వైరస్ లు విజృంభించటానికి ఇదే సరైన సమయం. తక్కువ ఉష్ణోగ్రతలు మన శరీర రోగనిరోధక వ్యవస్ధ ప్రతిస్పందనను తగ్గిస్తాయి. దీనర్థం మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. ఈ కధనం ద్వారా శీతాకాలంలో తప్పనిసరిగా నివారించాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం .

కేక్ లు, పండ్ల రసాలు, శీతల పానీయాలు వంటి పానీయాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. తినేటప్పుడు బాగానే ఉన్నా శరీరానికి అత్యంత ఘోరమైన శత్రువులుగా చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ఆహారాన్ని నేరుగా తీసుకోకూడదు. పావుగంట పాటు బయట ఉంచిన తరువాత చల్లదనం తగ్గితేనే తినాలి. చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

వేయించిన ఆహారం అనగా వేపుడులు, అయిల్స్ ఫుడ్స్ వంటి ఆహారాల్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఈ తరహా ఆహారాలు హానికరం. అధిక కొవ్వు పదార్ధం బరువు పెరగటంతోపాటు , శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. వీటి వల్ల ఆస్తమా ,ఇతర ఇన్ఫెక్షన్‌లకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి, చలికాలంలో పాలు, షేక్స్, స్మూతీస్ వంటి చల్లని పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉండటమే మంచిది.

గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక వేళ తింటే జీర్ణ సమస్యలు ,బరువు పెరగటం జరుగుతుంది. చల్లటి వాతావరణంలో ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం చాలా మంచిది. వాటి వల్ల అలర్జీ కలిగే ప్రమాదం ఉంటుంది.

Exit mobile version