Site icon Prime9

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ ఆహారాలను అస్సలు తీసుకోకూడదని మీకు తెలుసా..?

monsoon health tips

monsoon health tips

Monsoon Health Tips: వర్షాకాలంలో వచ్చిందంటే చాలు అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం వల్ల అనేక రోగాలు చుట్టుముడతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనితో చిన్న నుంచి పెద్దవారి వరకు చాలా మంది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. వానలు పడుతున్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతాము.

మరీ ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయంటే చాలు వేడివేడిగా ఏమైనా తీసుకోవాలనుకుంటాము దానికి తోడు స్పైసీగా ఏవైనా కరకరలాడుతూ ఉంటే జంక్ ఫుడ్ మరీ ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే ఇలాంటి ఆహారాలకే దూరంగా ఉండాలి అంటున్నారు ఆహార నిపుణులు. ఇవే కాకుండా కొన్ని రకాల కూరగాయలకు కూడా దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు. మరి వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

అవాయిడ్ సలాడ్స్
చాలా మంది సలాడ్ ఎక్కువగా తింటారు. దీనిని అనేక రకాల కూరగాయలతో మిక్స్ చేస్తారు కాబట్టి ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో సలాడ్స్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుందని అందుకే ఈ ఆహార పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు.

పుట్టగొడుగులకు నో చెప్పండి
వర్షాకాలంలో ఎక్కువగా లభించే పుట్టగొడుగులను తినడం మానేయండి. ఎందుకంటే పుట్టగొడుగు అనేది ఒక రకమైన ఫంగస్. ఇది నేలకి చాలా దగ్గరగా పెరగడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు పడే రోజుల్లో ఈ ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది.

పచ్చి కూరగాయలు తక్కువ చేయండి
వర్షాకాలంలో ఆకుకూరలకు కాస్త తగ్గించాలని ఆరోగ్య నిపుణుల సలహా. ఎందుకంటే వర్షాకాలంలో పచ్చి కూరగాయలలో క్రిమి, కీటకాలు ఎక్కువగా ఉంటాయి. దానిల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యకరమైన పెరుగు వర్షాకాలంలో హానికరం
పాల ఉత్పత్తులలో పెరుగు ఒకటి. ఇది ఎంత ఆరోగ్యకరమైనదో అంతే హానికరమైనది కూడా. ఎందుకంటే దీనిలో పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం ఫ్లూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెరుగులో శీతలీకరణ ప్రభావం ఎక్కువగా ఉంటుది.

Exit mobile version