Last Updated:

Ram Gopal Varma: తినండి.. తాగండి.. సెXX చేయండి.. విద్యార్థులకు రాంగోపాల్ వర్మ పాఠాలు

నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు.

Ram Gopal Varma: తినండి.. తాగండి.. సెXX చేయండి.. విద్యార్థులకు రాంగోపాల్ వర్మ పాఠాలు

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ.. ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఏది అనిపిస్తే అది చెప్తాడు. ఏది తోచితే అది చేస్తాడు. ట్విట్టర్లోనే కాకుండా.. మైక్ ముందు కూడా.. తాను ఎక్కడున్నాననే విషయం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాగేయడంలో వర్మ దిట్టనే చెప్పాలి. నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు.

చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు. అంతేకాకుండా తినండి.. తాగండి.. సెXX చేయండి అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విద్యార్థులకు వర్మ(Ram Gopal Varma) హితబోదలు

ఇంతకీ రామ్ గోపాల్ వర్మను అతిథిగా పిలిచిన కాలేజీ ఏంటి అనుకుంటున్నారా.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ. ఈనెల 15వ తేదీన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 అనే ఈవెంట్ ను ఏఎన్యూ విశ్వవిద్యాలయం ఘనంగా నిర్వహించింది. కాగా వేడుకలకు చీఫ్ గెస్ట్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యాడు. ఇక వర్మను చూడగానే అక్కడున్న స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వర్మ వర్మ అంటూ ఆర్జీవీ పేరుతో స్టేడియం మొత్తం ఓ రేంజ్ లో మారుమోగింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్మ “సాధారణంగా ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చాం అంటారు. కానీ నేను దాన్ని నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. నేను కాలేజ్ కు వచ్చాను కదా అని నేనో పెద్ద గొప్ప స్టూడెంట్ ను అని అనుకోవద్దు. నేను కాలేజ్ కు వెళ్లి బ్యాక్ బెంచ్ లో కూర్చొని నోవెల్స్ చదివేవాడిని. కనకదుర్గమ్మ టెంపుల్ కు వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులకు సైతం తన సెXX పురాణం చెప్పుకొచ్చారు.

నేను చస్తే స్వర్గానికెళ్లి ఎంజాయ్ చేస్తా..

నేనో పిచ్చి నా కొడుకును, జంతవును. యానిమల్స్ కు రిలేషన్స్ ఉండవు.. తిండి, ఆకలి, నిద్ర, సెXX. మనం కూడా జంతువులాంటివారమే. ఇక చావు గురించి భయపడకుండా దర్జాగా బతికెయ్యాలి..

ఎందుకంటే చావు అనేది ఎవరి చేతిలో ఉండు.. అది ఎప్పడు వస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకే నేను చనిపోతే గనుక మా అమ్మకు ఒకటే చెప్పాను..

నా శవం ముందు మంచిగా డ్యాన్స్ వేసి.. నాకొడుకు స్వర్గంలోని రంభ, ఊర్వశి, మేనకల దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్పు అని చెప్పానని తెలిపారు.

హిందూ ధర్మం ప్రకారం చనిపోయినవారు స్వర్గం లేదా నరకానికి వెళ్తారని స్వర్గంలో అయితే రంభ ఊర్వశి మేనకలు ఉంటారని అంటారు.

ఒకవేళ చచ్చి స్వర్గానికి వెళ్తే రంభ ఊర్వశివాళ్లు అక్కడ లేకపోతే డిస్సపాయింట్ అవుతాం. కనుక ఇక్కడే ఎంజాయ్ చెయ్యండి. తినండి.. తాగండి.. సెXX చేయండి. అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ రేంజ్ లో వర్మ స్పీచ్ విని అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్టూడెంట్స్ కు చెప్పే మాటలు ఇవేనా.. అసలు చెప్పే విధానం ఇదేనా అని మండిపడ్డారు.

ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అసలు స్టూడెంట్స్ కు లెక్చర్ ఇవ్వరు వర్మను పిలిచింది ఎవరు..? ఆయనను పిలిస్తే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్లు రాస్తున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి

https://www.youtube.com/Prime9News

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి

https://twitter.com/prime9news

https://www.instagram.com/prime9news/