Last Updated:

SS Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.. 10 భాగాలుగా రానున్న సినిమాకు సన్నాహాలు

తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంశం లేవనెత్తారు. 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సరైన టైం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే మూవీ తీయడానికి కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు.

SS Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.. 10 భాగాలుగా రానున్న సినిమాకు సన్నాహాలు

SS Rajamouli: తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఏ సినిమా అయినా వస్తుందంటే హీరో పేరిట ఆ సినిమా ఎక్కువగా ఫేమస్ అవుతుంది. అయితే రాజమౌళి సినిమాలకు మాత్రం అలా ఉండదు. ఎంతపెద్ద హీరో ఉన్న సరే ఈయన పేరు కనిపిస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినట్టే. ఈయన సినిమా వస్తుందంటే చాలు యావత్ దేశం కాదు కాదు ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాంటి జక్కన్న ప్రపంచంలోనే ఎంతో గొప్ప ఇతిహాసంగా పేరుగాంచిన మహాభారతాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందంటారు. ఊహించుకోవడానికి గూస్ బంప్స్ వస్తున్నాయ్ కదా. కాగా ఈ దర్శకధీరుడు త్వరలోనే మహాభారతాన్ని10 పార్టులుగా తెరమీదకు తీసుకురావడానికి తనదైన స్టైల్లో సన్నాహాలు చేస్తున్నారు. మరి జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా.

ఇకపోతే ‘మగధీర’ మొదలుకుని ‘బాహుబలి’ వంటి సినిమాలు వచ్చినప్పుడే ఆయన జానపదాలను.. పౌరాణికాలను ఎంత అద్భుతంగా ఆవిష్కరించగలరో తెలుసుకోవచ్చు. అందుకు తగినట్టుగానే ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్టు అని రాజమౌళి ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీని ఆవిష్కరించడానికి కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నానని ఆయన తెలిపారు.

టైం వచ్చింది.. ఇక మొదలుపెడదామా(SS Rajamouli)..

ఇక తాజా మరోసారి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంశం లేవనెత్తారు. ‘మహాభారతం’ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సరైన టైం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే మూవీ తీయడానికి కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు. ‘మహాభారతం’ కథ చాలా విస్తృతమైనదని అందువలన ప్రాజెక్టు ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని ఆయన చెప్పారు.

మహాభారతంలో కీలకమైన పాత్రలు చాలానే కనిపిస్తాయనీ, ప్రతి పాత్ర కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుందని అన్నారు. ఈ మొత్తం కథను 10 భాగాలలో పూర్తిచెయ్యాలనుకుంటున్నట్టు.. ఈ ప్రాజెక్టుకు ముందు రెండు మూడు సినిమాలను చేస్తానని జక్కన్న చెప్పుకొచ్చారు. దానితో ప్రేక్షకులు ఈ మూవీపై భారీ అంచనాలను ఏర్పరచుకున్నారు. ఇంక రాజమౌళి మామూలుగా ఓ సినిమా తియ్యడానికే అట్లీస్ట్ 2 నుంచి 3 ఏళ్లు తీస్తారని ఈ విధంగా కాలిక్యూలేట్ చేస్తే ఎంతకాదన్నా మహాభారతం 10 భాగాలు తియ్యడానికి కనీసంలో కనీసం ఓ 20 ఏళ్లు పడుతుందేమో అని ఊహలు ఉన్నాయి. పోనీ ఏడాదికి ఒక పార్ట్ అనుకున్నా, రాజమౌళి నుంచి 10 భాగాలు రావడానికి పదేళ్లకి పైన సమయం పట్టే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఒక ‘అవతార్’ .. ఒక ‘టెర్మినేటర్’ మాదిరిగా ‘మహాభారతం’ సిరీస్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.