Last Updated:

Extra Ordinary Man : నితిన్ “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో రాజశేఖర్.. వైరల్ గా వీడియో

యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో "ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం

Extra Ordinary Man : నితిన్ “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో రాజశేఖర్.. వైరల్ గా వీడియో

Extra Ordinary Man : యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన డేంజర్‌ పిల్లా లిరికల్ సాంగ్‌ను ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా డిసెంబరు 08న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమాను మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23 న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ అదే సమయానికి ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఎఫెక్ట్ తో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ లో మారుతున్నాయి. 2020లో ‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. ‘భీష్మ’ తర్వాత వచ్చిన ‘రంగ్ దే’ యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన ‘మాచర్ల నియోజకవర్గం’ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈయన ఈ మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

అయితే ఈ (Extra Ordinary Man) చిత్రంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ నిజం చేస్తూ రాజశేఖర్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు రాజశేఖర్ సెట్స్ కి వెళుతున్న క్రేజీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలుగు సినిమాలో మోస్ట్ సెలెబ్రేటెడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఆయన పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉండబోతోంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఇదే డిసెంబర్ 8వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ కూడా విడుదలవుతోంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.