Samantha: తనలా ఎవరూ ప్రేమించరు: సమంత ఎమోషనల్‌ పోస్ట్‌

  • Written By:
  • Updated On - December 9, 2024 / 03:41 PM IST

Samantha Emotional Post About Love: కొద్ది రోజులుగా సమంత సోషల్‌ మీడియాలో వరుస పోస్ట్స్‌ షేర్చే చేస్తోంది. వర్క్‌ లైఫ్, ప్రమోషనల్ కంటెస్టెంట్స్‌తో పాటు పలు సందేశాత్మక కోట్స్ పంచుకుంటుంది. అయితే తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో సమంత పోస్ట్స్‌ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సామ్‌ చేసిన తాజా పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. తన పెట్‌ డాగ్‌తో ఉన్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి “సాషా చూపించే ప్రేమ కంటే మరోక ప్రేమ లేదు” అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇది సామ్‌ ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు.

విడాకుల తర్వాత సామ్‌ జీవితమే ఓ పోరాటంగా మారిందని, వ్యక్తిగతం ఎన్నో ఒడిదుడుకులు చూస్తుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు తన మాజీ భర్త రెండో పెళ్లి టైంలో తన తండ్రి మరణించడం మరింత బాధాకరమైన, కొద్ది రోజులుగా సామ్‌ క్లిష్ట పరిస్థితులను చూస్తుందని సమంత పట్ల కన్‌సర్న్‌ ఫీల్ అవుతున్నారు. ఎన్నో పరిస్థితులు తనని కిందకు లాగాలని చూసిన సామ్‌ మాత్రం మనో ధైర్యంతో ముందుకు వెళుతుందని, ఆ దేవుడు ఎప్పుడు సామ్‌కు ఆలా గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇటీవల సామ్‌ ఓ సందేశాత్మక పోస్ట్‌ షేర్‌ చేస్తూ ఈ ఏడాది తనకు ఎలా గడిచిందో చెప్పిది. ఈ సంవత్సరం ఎన్నో సవాళ్లు చూవానని, వాటినుంచి పాఠాలు కూడా నేర్చుకున్నానని చెప్పింది. కాగా సమంత నటించిన యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్: హనీ, బన్నీ ఇటీవల అమెజాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ విడుదలైన ఈ సిరీస్‌ భారీ విజయం సాధించింది. విదేశాల్లో ఈ సిరీస్‌కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఇండియాలోనే ఇతర దేశాల్లో ఈ వెబ్‌ సిరీస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో కొద్ది రోజులుగా సామ్‌ సిటాడెల్ సక్సెస్‌ మీట్స్, ఇంటర్య్వూతో బిజీ బిజీగా ఉంది.