Site icon Prime9

Mohan Babu: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మంచు మోహన్‌ బాబు

Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్‌ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌ కాంటినెంట్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కాస్తా మెరుగుపరడటంతో వైద్యులు డిసెంబర్‌ 12న డిశ్చార్ట్స్‌ చేశారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. చికిత్స అనంతరం మోహన్‌ బాబు తన నివాసానికి వెళ్లారు. కాగా గత నాలుగు రోజులుగా ఆయన ఇంట్లో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

తన కుమారుడు మంచు మనోజ్‌కు ఆయనకు ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయి. ఈ గొడవల కాస్తా మంగళవారం తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన కొడుకు తనపై దాడి చేశాడు, మనోజ్‌ అతడి భార్య మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీకి వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే మనోజ్‌ కూడా అక్రమంగా తన ఇంటిపై తన తండ్రి అనుచరులు దాడి చేశారని, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తనని కొట్టారని పహాడీ షరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తండ్రికొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకునే వరకు వెళ్లాయి.

ఈ క్రమంలో తీవ్ర అసహానికి గురైన మోహన్‌ బాబు మీడియాపై సైతం దాడి చేశారు. గొడవ విషయమైన అసలేం జరిగిందో చెప్పాలని కోరిన ఇద్దరు మీడియా ప్రతినిథులపై మైక్‌తో దాడికి తెగబడ్డారు. దీంతో జర్నలిస్ట్‌ సంఘాలను నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. మోహన్‌ బాబును వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంలో ఆయనను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల మధ్య మంచు మోహన్‌ బాబు హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్న ఆయన తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు చల్లారినట్టు కనిపిస్తున్నాయి. కుటుంబమంతా కూర్చోని చర్చించుకునేందుకు రెడీ అయ్యారు. మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరిపి ఆస్తి వివాదాలను తీర్చుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మనోజ్‌ని ఇంట్లోకి రాకుండ మోహన్‌ బాబు, విష్ణు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో మనోజ్‌ తన అనుచరులతో కలిసి ఇంటి లోపలికి బలవంతగా వెళ్లాడు. ఈ క్రమంలో వారిని ఆపేందుకు భారీ సంఖ్యలో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు.

Exit mobile version