Keerthy Suresh Wedding Pics: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. పెద్దల సమక్షంలో తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేసింది. తాజాగా పెళ్లి ఫోటోలను కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
‘ఫర్ ది లవ్ ఆఫ్ నైక్’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. కాగా డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో సౌత్ ఇండియా సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగినట్టు ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతుంది.
ఈ ఫొటోల్లో కీర్తి, ఆంటోనిలు సంప్రదాయమైన పెళ్లి దుస్తుల్లో కనిపించారు. పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అంతా ఈ కొత్త జంటలకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. కాగా ఇటీవల కీర్తి తన ప్రియుడు ఆంటోనిని పరిచయం చేసిన సంగతి తెలిసందే.
15 ఏళ్లుగా ఆంటోనితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. కాగా ఆంటోని దుబాయ్ చెందిన వ్యాపారవేత్త. అతడు కొచ్చిలో జన్మించాడు. స్కూలింగ్ నుంచి వీరిద్దరికి పరిచయం ఉంది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ వీరు కొన్నేళ్లు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.