Site icon Prime9

Naga Chaitanya-Sobhita: పెళ్లి తర్వాత ఫస్ట్‌ టైం జంటగా చై-శోభిత.. ముంబై పెళ్లిలో సందడి

Naga Chaitanya-Sobhita in Mumbai Wedding: నాగ చైతన్య-శోభిత ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసందే. డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట సైలెంటగా ఉంది. ఎక్కడ కూడా బయట కనిపించలేదు.

దీంతో ఈ కొత్త జంట ఏ హానీమూన్‌కో వెళ్లి ఉంటుందని అనుకున్నారు. అయితే తాజాగా ఈ కొత్త జంట ముంబైలో సందడి చేసింది. పెళ్లయిన వారం రోజులకు ఫస్ట్‌టైం భార్యభర్తలుగా మీడియాకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం వీరి ఫోటోలు, వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. గత రాత్రి బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లి జరిగింది. ఆమె బాయ్‌ఫ్రెండ షేర్‌ గ్రెగోయిర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ సెలబ్రిటీల కోసం ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ సినీ తారలు, ప్రముఖులంతా పాల్గొన్నారు.

అలాగే శోభిత ధూళిపాళ-నాగ చైతన్యకు కూడా ఆహ్వానం అందింది. ఈ వేడుకలో ఈ కొత్త జంట స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో శోభిత గోల్డెన్‌ అండ్‌ గ్రీన్‌ కలర్‌ కాంబినేషన్‌ చుడిదార్‌లో ఆకట్టుకోగా.. చై బ్లాక్‌ సూట్‌ ధరించాడు. ఇద్దరు జంటగా అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా శోభితను ఇండస్ట్రీకి పరిచయం చేసింది అనురాగ్‌ కశ్యప్‌ అనే విషయం తెలిసిందే. 2016లో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రామన్‌ రాఘవ్‌ 2.0 శోభిత కీలక పాత్ర పోషించింది.

ఈ సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శోభిత కీలక పాత్రలో నటించిన నెట్‌ఫ్లిక్స్‌ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లోని ఓ సెగ్మెంట్ కు అనురాగ్ దర్శకత్వం వహించారు. అలాగే అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహరించినమలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘మూథోన్‌’లో కూడా శోభిత ఫిమేల్ లీడ్ రోల్ పోషించింది. దీనికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించింది. అలా కెరీర్‌ మొదటి నుంచి శోభితకు అనురాగ్‌ కశ్యప్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో తన కూతురి పెళ్లికి అనురాగ్‌ శోభత దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చాడు.

Exit mobile version