Zebra OTT: ఓటీటీకి లేటెస్ట్‌ హిట్‌ క్రైం థ్రిల్లర్‌ జీబ్రా – స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ఆహా

  • Written By:
  • Updated On - December 12, 2024 / 05:23 PM IST

Satyadev Zebra OTT Release: సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ జీబ్రా. క్రైమ్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించగా.. నటుడు ధనుంజయ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మజ ఫిల్మ్‌ ప్రైవేట్‌ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో పాటు డిసెంట్‌ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. కాగా నవంబర్‌ 22న జీబ్రాతో పాటు విశ్వక్‌ సేన్‌ మెకానిక్‌ రాకీ, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా దేవకి నందన వాసుదేవ సినిమాలు కూడా విడుదలయ్యాయి.

అయితే వాటితో పోలిస్తే జీబ్రా మంచి టాక్‌ తెచ్చుకుంది. బ్యాంక్ నేపథ్యంలో క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీంతో మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ తెలుగు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తున్నట్టు ఓ ప్రకటన ఇచ్చింది. అయితే ఇందులో స్ట్రీమింగ్‌ డేట్‌ ప్రకటించకుండ సస్పెన్స్‌లో ఉంచింది. ఓటీటీకి త్వరలో జీబ్రా అంటూ ఓ పోస్టర్‌తో అప్‌డేట్‌ ఇచ్చింది. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌పై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేకపోయినా డిసెంబర్‌ 14 నుంచి ఆహాలో జీబ్రా విడుదల కానుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేయిట్‌ చేయక తప్పుదు. బ్యాంక్‌ ఉద్యోగి అయిన హీరో సూర్య రూ. 5 కోట్ల స్కాంలో ఇరుక్కుంటాడు. ఆ డబ్బు పేరుమోసిన వ్యాపారవేత్తకు సంబంధించింది. మరి దాని నుంచి అతడు ఎలా బయటపడ్డాడేనేదే ఈ కథ.

అసలు కథేంటంటే

సూర్య (సత్యదేవ్) మిడిల్‌ క్లాస్‌ కుటుంబం నుంచి వస్తాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పని చేస్తాడు. అతడికి మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఓ రోజు స్వాతి బ్యాంకులో ట్రాన్స్‌క్షన్‌ చేసే క్రమంలో పోరపాటు చేస్తుంది. ఒక నెంబర్‌ తప్పుగా ఎంటర్‌ చేయడంతో ఒకరి అకౌంట్లో పడాల్సిన డబ్బులు మరోకరి అకౌంట్లో పడతాయి. దీంతో ఓ అకౌంట్‌లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్‌లో పడతాయి. అయితే ఆ వ్యక్తి ఆ డబ్బులను ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి సూర్యని సాయం అడుగుతుంది. అతడు తెలివిగా ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చేసి స్వాతిని పెద్ద సమస్య నుంచి బయటపడేస్తాడు. ఈ ప్రాసెస్‌లో సదరు వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే తన తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో సూర్య ఆ డబ్బు తిరిగిస్తానని మాట ఇస్తాడు. మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య 4 రోజుల్లో ఆ డబ్బు ఎలా సంపాదించాడు? ఇంతకి ఆ డాన్‌కి డబ్బు ఇచ్చాడా? లేదా? రూ. 5 కోట్లు ఎలా మాయం అయ్యాయనేది జీబ్రా కథ.