Site icon Prime9

BYD Dolphin Update: బివైడి బెస్ట్ సెల్లింగ్ మోడల్.. డాల్ఫిన్ ఈవీ.. సరికొత్త అప్‌డేట్‌లో వచ్చేస్తోంది..!

BYD Dolphin

BYD Dolphin

BYD Dolphin Update: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ BYD పోర్ట్‌ఫోలియోలో డాల్ఫిన్ EV బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2021లో విడుదలైంది. ఇప్పుడు ఇది వచ్చే ఏడాది దాని మొదటి మెయిన్ అప్‌డేట్‌ను పొందబోతోంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, డేటా దాని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది.

పాత మోడల్‌తో పోలిస్తే.. 2026 BYD డాల్ఫిన్ ఎక్స్‌టీరియర్ డిజైన్ కోసం మరింత మినిమలిస్ట్ డిజైన్ విధానాన్ని ఉపయోగిస్తుంది. BYD ఒక సాధారణ క్లోజ్డ్ గ్రిల్, ముందు భాగంలో చిన్న బంపర్ ఇన్‌టేక్‌ని ఎంచుకుంది. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా చిన్నది. ప్రస్తుత మోడల్‌తో కనిపించే బూమరాంగ్ ఆకారపు యూనిట్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

BYD ఓషన్ సిరీస్ కార్ల కోసం ఉపయోగించే థీమ్‌తో బెటర్ ఎలైన్మెంట్  చేయడానికి హెడ్‌లైట్‌లు కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది. 2026 BYD డాల్ఫిన్ EV సైడ్ ప్రొఫైల్ చాలా వరకు ప్రస్తుత మోడల్‌ని పోలి ఉంటుంది. అయితే అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్ అందించారు. వేరియంట్‌పై ఆధారపడి, కస్టమర్‌లు 16-అంగుళాల లేదా 17-అంగుళాల వాహనాలను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

దీనికి వెనుకవైపు స్పోర్టీ డిజైన్ ఇచ్చారు. దీని టైల్‌లైట్, బంపర్‌లో మార్పులు చేశారు. MIIT వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం 2026 BYD డాల్ఫిన్  కొలతలను కూడా వెల్లడిస్తుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ప్రస్తుతం చైనాలో విక్రయిస్తున్న మోడల్ కంటే 155 మిమీ పొడవుగా ఉంది. ఎక్కువ లెగ్‌రూమ్‌ను ఇందులో చూడచ్చు. 2026 BYD డాల్ఫిన్ 4,280mm పొడవు, 1,770mm వెడల్పు, 1,570mm పొడవు. దీని వీల్ బేస్ 2,700ఎమ్ఎమ్. 2026 BYD డాల్ఫిన్ 2023లో ప్రారంభించిన గ్లోబల్-స్పెక్ మోడల్ కంటే 10mm చిన్నది.

ప్రస్తుత BYD డాల్ఫిన్ EV రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 94 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే టాప్-వేరియంట్ 210 హెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు 2026 BYD డాల్ఫిన్ కోసం అలాగే ఉంచారు. అయితే కొత్త మోడల్ అదనపు మిడ్-స్పెక్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుంది. ఇది 174 హెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది. దీని 44.93 kWh బ్యాటరీ ప్యాక్ 420Km, 60.48 kWh బ్యాటరీ ప్యాక్ 520Km రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం చైనాలో బివైడి డాల్ఫిన్ ధర రూ.11.66 లక్షల నుంచి రూ.15.16 లక్షల వరకు ఉంది.

Exit mobile version
Skip to toolbar