Last Updated:

Project K : “ప్రాజెక్ట్ k” కోసం అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్, రానా.. పిక్ అదిరిపోయిందిగా !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..

Project K : “ప్రాజెక్ట్ k” కోసం అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్, రానా.. పిక్ అదిరిపోయిందిగా !

Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అలానే దిశా పఠాని, పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తుంది మూవీ టీం. మేకింగ్ వీడియోలు, గ్లింప్స్ లతో ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తుంది.

కాగా ఈ గురువారం (జూలై 20) మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో ఈ (Project K) గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K చరిత్ర సృష్టించింది. ఇక ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొనబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

అయితే వీరితో పాటు ఈ ఈవెంట్ కి ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా వెళ్ళాడు. ఈ మేరకు ప్రభాస్, రానా అమెరికాలో ల్యాండ్ అయ్యినట్లు ఉన్న ఫోటోని మూవీ యూనిట్ షేర్ చేసింది. ఇక ఆ పిక్ లో ప్రభాస్ వెనుక నుంచి మాత్రమే కనిపిస్తున్నాడు. మరి మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోయే గ్లింప్స్ ఎంలాటి స్పందన ఎదురుకుంటుందో చూడాలి. ఈ సంవత్సరం జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలవుతుంది. జులై 23 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి లక్షకు పైగా ఆడియన్స్ రానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక మంది మూవీ లవర్స్, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి  విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నాలుగు లేదా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు.