Last Updated:

Mega 154 Title Teaser: రచ్చలేపుతున్న మెగా 154 టైటిల్ టీజర్.. పక్కా మాస్ లుక్ లో మెగాస్టార్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. మెగా అభిమానులకు దివాళి మాస్ మెగా ఎంటర్టైనర్ గా టైటిల్ టీజర్ వదిలారు. ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోని సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. ఇలాంది మాస్ యాక్షనే కదా బాస్ నుంచి కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

Mega 154 Title Teaser: రచ్చలేపుతున్న మెగా 154 టైటిల్ టీజర్.. పక్కా మాస్ లుక్ లో మెగాస్టార్

Mega 154 Title Teaser: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. మెగా అభిమానులకు దివాళి మాస్ మెగా ఎంటర్టైనర్ గా టైటిల్ టీజర్ వదిలారు. ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోని సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. ఇలాంది మాస్ యాక్షనే కదా బాస్ నుంచి కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న కొత్త సినిమా నుంచి మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అప్‌డేట్ను విడుదల చేశారు చిత్ర బృందం. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మెగా అభిమానులకు దీపావళి కానుక ఇచ్చారు దర్శక, నిర్మాతలు. మెగా లోకంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటేలా ఈ మెగా154 టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే అందరూ ముందుగా ఊహించినట్లుగానే ఈ సినిమా పేరును వాల్తేరు వీరయ్యగా ప్రకటించి టైటిల్ టీజర్ విడుదల చేశారు డైరెక్టర్ బాబీ.

ఈ వీడియోలో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా చిరంజీవి ఇంట్రడక్షన్ చూపించారు. నోట్లో బీడీతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్ ను చూపించి ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా చూడాలంటే లైక్, షేర్, సబ్స్‌స్క్రైబ్ చేయండి అంటూ మెగాస్టార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అయితే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇదీ చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్ ను తగులబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

 

ఇవి కూడా చదవండి: