Last Updated:

Actor Sivaji: సినిమాలు లేని టైమ్ లో నేను ఆ పనే చేసేవాడిని.. నన్ను నిలబెట్టింది అదే

Actor Sivaji: సినిమాలు లేని టైమ్ లో నేను ఆ పనే చేసేవాడిని.. నన్ను నిలబెట్టింది అదే

Actor Sivaji: గత మూడు రోజుల నుంచి మంగపతి అదేనండీ శివాజీ పేరు సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. సక్సెస్ అనేది వచ్చే టైమ్ కి కచ్చితంగా వస్తుంది. అప్పటివరకు మన పని మనం చేసుకుంటూ దానికోసం ఎదురుచూడడమే. శివాజీ కూడా అదే పని చేశాడు. ఎన్నో ఏళ్ళ శ్రమ.. కోర్ట్ సినిమాతో అతనికి సక్సెస్ ను అందించింది.

 

హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. నాని నిర్మించిన ఈ సినిమాలో హైలైట్ అంటే  మంగపతి క్యారెక్టర్ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ లో శివాజీ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మంగపతి లేకపోతే కోర్ట్ సినిమా లేదు. ప్రస్తుతం శివాజీ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

 

ఇప్పుడంటే ఓకే కానీ, ఒకప్పుడు శివాజీ చాలా ఇబ్బందులను ఫేస్ చేశాడు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు అతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఒక స్కామ్ లో కూడా శివాజీ పేరు ఉంది. ఇక దీని తరువాత అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి కొన్నేళ్లు ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో తనను నిలబెట్టింది రియల్ ఎస్టేట్ అని శివాజీ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

” సినిమాలు గ్యాప్ ఇచ్చిన తరువాత నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం  చేశాను. ఇటు తీసుకొని అటు అమ్మేవాడిని. అటు తీసుకొని ఇటు అమ్మేవాడిని. అదే నన్ను నిలబెట్టింది. అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు మరీ పిచ్చెక్కిపోయి చేస్తున్నారు. అసలు మనిషి  తను ఉండే నీడకు ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే.. న్యూయార్క్ డౌన్ టౌన్‌లో కూడా ఈ రేట్లు లేవండీ బాబూ. ఒక విల్లా.. రూ.36 కోట్లు అంట. న్యూయార్క్ డౌన్ టౌన్‌లో  పెంట్ హౌస్ వస్తుంది.

 

రోజు రెండు కోట్ల మంది జనాలు న్యూయార్క్ ను టచ్ చేస్తారు. అలాంటి సిటీలో లేని రేట్లు రెండు తెలుగురాష్ట్రాల్లో ఉన్నాయి. రూ.36 కోట్ల విల్లాలో బతకాలంటే.. నేను నెలకు 15 కోట్లు సంపాదించాలి. డబ్బున్న మారాజులకు ప్రాబ్లెమ్ ఏం లేదు. మళ్లీ ఈ బూమ్ పడిపోతుందా అంటే.. ఇది మిడి మిడి సిరి అంతే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా తరువాత శివాజీకి వరుస ఆఫర్స్ లైన్ కట్టాయి. ప్రస్తుతం శివాజీ #90’s సిరీస్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.