Last Updated:

Kiran Abbavaram: ఒక్క సినిమాలో 20 లిప్ లాక్ లా.. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అవుతావా ఏంటి కిరణ్ అన్నా.. ?

Kiran Abbavaram: ఒక్క సినిమాలో 20 లిప్ లాక్ లా.. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అవుతావా ఏంటి కిరణ్ అన్నా.. ?

Kiran Abbavaram: టాలీవుడ్ కుర్రహీరో కిరణ్ అబ్బవరం.. క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కిరణ్ జోరు పెంచేశాడు.  క సినిమాకు ముందు కూడా ఏడాదిలో మూడు సినిమాలు రిలిజ్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే క సినిమాకు మాత్రం ఒక ఏడాది గ్యాప్ తీసుకొని మంచి కథతో వచ్చాడు.  ప్రతి సినిమాలో ఒకే లుక్ ఉండడంతో.. ఏడాది పాటు జుట్టు పెంచి.. క సినిమా కోసం కష్టపడి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత కూడా కిరణ్ అలానే ఏడాదికి ఒకటి.. అలా చేస్తాడనుకున్నారు. కానీ, కిరణ్ పాత పద్ధతినే అవలంబిస్తున్నాడు.

 

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 సినిమాలను కిరణ్ లైన్లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కుర్ర హీరో  నటిస్తున్న చిత్రాల్లో దిల్ రుబా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. K ర్యాంప్ సెట్స్ మీద ఉంది. నాని అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు.ఈ చిత్రంలో కిరణ్ సరసన రంగబలి భామ యుక్తి తరేజా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా కిరణ్ అబ్బవరం K ర్యాంప్  కోసం సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడట. దీనికోసం కసరత్తులు గట్టిగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Suriya: ఆ ఐదు రోజులు జైల్లో ఉన్నట్లే అనిపించింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సూర్య

ఇక ఇదే కాకుండా ఇందులో  కిరణ్ అబ్బవరం.. మంచి రొమాంటిక్ హీరోగా కనిపిస్తాడట. హీరోయిన్ తో ఒకటి కాదు రెండు కాదు 20 లిప్ లాక్ లు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కిరణ్ సినిమా అంటే.. చాలా డీసెంట్ గా ఉండేవి. ఆడవారి గురించి కిరణ్ ప్రతి సినిమాలో గొప్పలు చెప్తూ ఉంటాడు. ఏ సినిమాలో ఇప్పటివరకు లిప్ లాక్ పెట్టింది కూడా లేదు. కానీ, K ర్యాంప్ కోసం మాత్రం మనోడు 20 లిప్ లాక్ పెట్టడానికి రెడీ అయ్యాడట. అయితే అవన్నీ కథ డిమాండ్ చేయడంతోనే కిరణ్ ఒప్పుకున్నాడని టాక్.

 

ఇక ఈ విషయం  తెలియడంతో నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమాలో 20 లిప్ లాక్ లా.. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అవుతావా ఏంటి కిరణ్ అన్నా.. ? అని కొందరు.. లక్ కుదిరిందిలే అలా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్, రొమాన్స్ లతో పాటు ఎమోషనల్ టచ్ తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.  మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: