Last Updated:

Gold Smuggling : విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల బంగారం సీజ్..

ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి

Gold Smuggling : విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల బంగారం సీజ్..

Gold Smuggling : ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పట్టుబడిన బంగారం ఇటీవల శ్రీలంక, దుబాయ్ నుంచి అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చినట్లు గుర్తించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేపడుతున్న కస్టమ్స్ అధికారులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేపట్టిన అధికారులు 11 కిలోల బంగారం గుర్తించారు. అలాగే కువైట్, ఖతార్, ఒమన్ దేశాలకు చెందిన రూ.1.5 లక్షల విలువచేసే కరెన్సీ లభించింది. ఆగస్ట్ 25 తెల్లవారు జామున చేపట్టిన తనిఖీల్లో బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం 4.3 కిలోల ముడి బంగారం, 6.8 కిలోల ఆభరణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ బంగారాన్ని గుర్తించకుండా ఆయా దేశాలకు చెందిన గుర్తులను చెరిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గత రెండేళ్లతో విజయవాడ కస్టమ్స్ కమీషనరేట్ పరిధిలో రూ.40 కోట్ల విలువచేసే 70 కిలోల అక్రమ బంగారం పట్టుబడినట్లు వారు వివరించారు.

Foreign currency