OYO: ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టులను మూసివేసి ఆయా టీంలను విలీనం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఇదే సమయంలో సేల్స్ టీంలో 250 మంది ఉద్యోగులను నియమించుకుంటామని కూడా ఓయో తెలిపింది.
తాము తొలగించే ఉద్యోగులకు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తామని ఓయో వ్యవస్ధాపక సీఈఓ రితేష్ అగర్వాల్ చెప్పారు. ఓయోకు విస్తృతంగా సేవలందించిన ఈ ఉద్యోగులను వదులుకోవాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఓయో ఎదుగుదలతో పాటు రాబోయే రోజుల్లో వీరి సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు.
ఓయో 2020లోనూ దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించగా రెండో దశలో తాజా లేఆఫ్స్‌ను ప్రకటించింది.