Onion Prices: మరోమారు ఉల్లిధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉల్లికి ప్రధానమార్కెట్ మహారాష్ర్ట.. ఇక్కడి లాసన్‌గావ్ మండిలో సరాసరి ఉల్లిధర సోమవారం నాడు కిలో రూ.26లు పలికింది. అంతకు ముందు అంటే మే 25న ఉల్లిధర కేవలం రూ.17 మాత్రమే. అయితే అత్యంత నాణ్యమైన ఉల్లి ధర ఇక్కడ కిలో రూ.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడి టోకు మార్కెట్లో ఇవి అతి తక్కువ అమ్మకాలు జరుగుతాయి. ఇక ఉల్లిధరలు గత పక్షం రోజుల నుంచి చూస్తే 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. దీనికి కారణం మార్కెట్ సరకు రావడం తగ్గముఖం పట్టడమేనని ఇక్కడి వర్తకులు చెబుతున్నారు. మరో పక్క వచ్చే సోమవారం నాడు ముస్లింల బక్రీద్ సందర్భంగా ఉల్లికి డిమాండ్ పెరిగింది.
పెద్ద ఎత్తున సరుకు నిల్వ..(Onion Prices)
కేంద్రప్రభుత్వం ధరల నియంత్రణలో జోక్యం చేసుకోకపోవచ్చుననే ఆలోచనతో ఇక్కడి వర్తకులు పెద్ద ఎత్తున సరకు నిల్వ చేసి పెట్టుకున్నారు. నాసిక్‌లోని లాసన్‌మండిలో సోమవారం నాడు కిలో ఉల్లి రూ.26 పలికింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ – సరఫరాకు మధ్య వ్యత్యాసమేనని కారణాలు చెబుతున్నారు ఇక్కడి వర్తకులు. అదీ కాకుండా మార్కెట్‌కు కొత్త సరకు రావడం తగ్గింది. రైతులు కూడా గిట్టుబాటు ధర లభించాలని సరకు ట్రేడర్లకు విక్రయించడం లేదు. 2023-24 రబీలోపంట దిగుబడి తగ్గుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. పంట దిగుబడి తగ్గితే లాభాలకు విక్రయించుకోవాలని రైతులు ఎదురు చూస్తున్నారు.
ఇక ఉల్లి ఎగుమతులు కూడా మందగించాయి. దీనికి కారణం ప్రభుత్వం ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తోంది. ఈ నెల 17న దేశ్యాప్తంగా బక్రీద్ సందర్బంగా ఉల్లికి డిమాండ్ పెరగుతుందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో మహారాష్ర్ట ఉల్లికి మంచి డిమాండ్ ఉందని నాసిక్‌కు చెందిన ట్రేడర్ వికాస్‌సింగ్ చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున సరకు నిల్వ చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తగ్గిస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.దీంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ఆలోచనల ఉన్నట్లు హార్టికల్చర్‌ప్రొడ్యూస్ ఎక్స్‌పోర్టర్ అసోసియేషన్ ప్రసిడెంట్ అజిత్ షా చెప్పారు.