Site icon Prime9

Anand Mahindra: ఆరుగురు ప్రయాణించే బైక్.. ఆనంద్ మహింద్రా ఇంప్రెస్

Anand Mahindra shares clip of innovative passenger vehicle

Anand Mahindra shares clip of innovative passenger vehicle

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలు వీడియోలతో పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం నెటిజన్లకు చేస్తుంటారు.

తాజాగా ఈ వ్యాపార దిగ్గజం మరో కొత్త సృజనాత్మకతను నెటిజన్లకు పరిచయం చేశారు. ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వాహనం చూసేందుకు పెద్దసైజ్‌ బైక్‌లా కనిపిస్తోంది. వేర్వేరు సీట్లు కలిగిన ఈ పొడవాటి వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ ‘గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు చేసినట్లు దాని రూపకర్త తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు యువకుడి సృజనాత్మకతకు ఫిదా అవుతున్నారు.

ఇదీ చదవండి: ట్విట్టర్ బ్లూటిక్ ఫీజుపై “పేటీఎం” చీఫ్ కౌంటర్

Exit mobile version