Site icon Prime9

ORS Sales UP: మే నెలలో6.8 కోట్ల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అమ్మడుపోయాయి.. కారణం ఏమిటో తెలుసా?

ORS Sales

ORS Sales

ORS Sales UP: ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) అమ్మకాలు మే నెలలో ఏకంగా 20 శాతం పెరగాయని పార్మాట్రాక్‌ తాజా గణాంకాలను వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఓఆర్‌ఎస్‌ విషయానికి వస్తే మన దేహం కోల్పోయిన అదనపు నీటితో పాటు ఎలక్ర్టోలైట్స్‌ తిరిగి పొందడానికి సహకరిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతకు, విరేచనాల ద్వారా మన దేహంలో నీరు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఇక మనదేశంలో ఒఆర్‌ఎస్‌ వినియోగం ఫిబ్రవరి నెల నుంచి క్రమంగా పెరగుతూవస్తుంది. ఇక ఫిబ్రవరి నుంచి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి.

అటు తర్వాత జూన్ నుంచి జూలై నుంచి దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అప్పుడు కూడా ఓఆర్‌ఎస్‌కు డిమాండ్‌ తగ్గదు. ఎందుకంటే వర్షాకాలంలో కలుషిత నీరు వల్ల జబ్బలు వస్తుంటాయి. ఉదారణకు కొత్త నీటి ద్వారా నీటి ఆధారత జబ్బులు పెరిగిపోతుంటాయి. ఎక్కువగా ప్రజలు విరేచనాల బారిన పడుతుంటారు. దీనికి మళ్లీ ఓఆర్‌ఎస్‌నే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది దేశంలో ఎండలు విపరీతగా కాశాయి. మే, జూన్‌ నెలలో కూడా అత్యధికంగా ఎండలు కాశాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. దేశంలోని తూర్పు ప్రాంతంతో పాటు దేశంలోని వాయువ్య ప్రాంతంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 49.9 డిగ్రీలుష్ణోగ్రత నమోదైంది.

రూ.84 కోట్ల అమ్మకాలు..(ORS Sales UP)

ఇక కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఈ ఏడాది మే నెలలో సుమారు6.8 కోట్ల సాచెట్స్‌ విక్రయించింది. దీని విలువ రూ.84 కోట్లు. గత ఏడాది ఇదే మే నెలలో 5.8 కోట్ల సాచెట్‌లు విక్రయించింది. అప్పుడు దాని విలువ రూ.69 కోట్లు. గత నాలుగు సంవత్సరాల నుంచి కంపెనీ టర్నోవర్‌ రెట్టింపు అయ్యింది. మే 20202లో రూ.344 కోట్ల వ్యాపారం చేస్తే.. 2024 నాటికి వచ్చే సరికి రూ.716 కోట్ల వ్యాపారం చేసింది. కాగా గత ఏడాది రూ.583 కోట్ల టర్నోవర్‌ చేసింది.

 

 

Exit mobile version