Tata Sierra SUV: టైగర్‌ను దింపుతున్న టాటా.. ఆల్-న్యూ సియెర్రా వచ్చేస్తోంది.. బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలే..!

Tata Sierra SUV: టాటా మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్-న్యూ సియెర్రా ఎస్‌యూవీని విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. గత జనవరిలో ఘనంగా ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త సియెర్రా కారును ప్రదర్శించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు పాత టాటా సియెర్రా ఎస్‌యూవీ 1991 నుండి 2003 వరకు దేశ రహదారులను అలంకరించింది. ప్రస్తుతం ఇది కొత్త రూపంలో విక్రయానికి వస్తోంది.
ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కొత్త ‘టాటా సియెర్రా’ ఎస్‌చయూవీ కూడా టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్నీలకు గట్టి పోటీనిచ్చే ఈ సియెర్రా కారు ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్నది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంధనంతో నడిచే మోడల్‌ను మొదట విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పవర్డ్ మోడల్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
Tata Sierra SUV Features And Specifications
పెట్రోల్/ఎలక్ట్రిక్ ఆధారిత టాటా సియెర్రా ఎస్‌యూవీలు దాదాపు అదే డిజైన్‌ను కలిగి ఉంటాయి. దీనిని భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించి మోడల్ ద్వారా ధృవీకరించింది. కొత్త సియెర్రాలో LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ బి-పిల్లర్లు, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ లైట్ సెటప్ ఉన్నాయి సియెర్రా ఎస్‌యూవీ ఇంధనంతో నడిచే మోడల్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది, ఇది 18 నుండి 20 kmpl మైలేజీని అందజేస్తుంది.
ఎలక్ట్రిక్ పవర్డ్ మోడల్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల వరకు నడుస్తుందని భావిస్తున్నారు. ఈ కారు డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త సియెర్రా ఎస్‌యూవీలో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tata Sierra SUV Price
కొత్త టాటా సియెర్రా ఎస్‌యూవీ 5 సీట్లతో వస్తుంది. ఇంధనంతో నడిచే మోడల్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఎలక్ట్రిక్ పవర్డ్ మోడల్ ధర రూ. 25 నుండి 30 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ఉంటుందని చెబుతున్నారు.