Home /Author Guruvendhar Reddy
8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam: దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబై బయలుదేరిన ఈ రైలు ఇంజిన్ తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం […]
Israel offers update Hamas chief Yahya Sinwar dead: హమాస్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజయం సాధించింది. హమాస్‌పై చేసిన దాడిలో ఆ దేశ కొత్త చీఫ్ యాహ్య సిన్వార్ హతమైనట్లు తెలుస్తోంది. తాజాగా, హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో యాహ్య సిన్వర్‌ను హతమార్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గాజాలోని స్ట్రిప్ అనే ప్రాంతంపై గురువారం ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆ దేశ […]
Nayab Singh Saini Takes Oath As Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని షాలిమార్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, వివిధ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం […]
India all out 46 against New Zealand: బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలుత 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2) పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి, సర్పరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు డబుల్ […]
TSPSC Group 1 Mains exam Issue: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. ఈ నెల 21 నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని రాత్రి అశోక్ నగర్లో ఆందోళన చేపట్టారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు, జీఓ 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి […]
Allu Arjun rocks new poster from Pushpa 2 movie: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘ఫుష్ప- 2. ఈ సినిమాలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఈ సినిమా మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 6న […]
Deputy CM Pawan Kalyan committed to creating wealth from waste: మనిషి భూమిని సొంతం చేసుకోవడం కాదు.. తిరిగి మనిషే భూమికి సొంతమవుతాడు’ అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రకృతి పట్ల, భూమి పట్ల అవగాహన, బాధ్యతతో వ్యవహరించాలి. మన భవిష్యత్ తరాలకు నిజమైన వారసత్వపు ఆస్తిగా… ప్రకృతిని, పర్యావరణాన్ని అందించాలి. ఇదే సంకల్పంతో ముందడుగు వేశారు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖామంత్రి పవన్ కల్యాణ్. ప్రకృతి పట్ల ప్రేమ, […]
20 people dead after consuming spurious liquor in Bihar: బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది మృత్యువాత పడగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సివాన్, సారన్ జిల్లాలోని ముష్రఖ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఇబ్రహీంపూర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్, సారన్ జిల్లాలోని చెందిన పలువురు మద్యం తాగారు. అయితే కల్తీ మద్యం కావడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే […]
India vs New Zealand 1st Test Day 2 Match Today: స్వదేశంలో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో నేడు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. మ్యాచ్‌లో రెండో రోజులో భాగంగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గురువారం ఉదయం 15 నిమిషాల ముందే టాస్ వేయగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా తొలి రోజు టాస్ పడకుండానే ఆట పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియా: […]
Ratan tata passed away: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయనను ముంబయిలోని బ్రీచ్ ప్రైవేటు ఆస్పత్రి తరలించగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ప్రకటించింది, రతన్ టాటా..1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.