ISRO: అంతరిక్షానికి తెలుగమ్మాయి… వ్యోమోగామిగా ఎంపిక.!

ISRO: అమ్మమ్మ ఇన్స్‌పిరేషన్, నానమ్మ చెప్పిక కథలు ఆమెను అంతరిక్షాన నిలిపింది. ఆడవారు వంటింటికే పరిమితం కావొద్దన్న పెద్దల సూచనలతో ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తెలుగు తేజం దంగేటి జాహ్నవి. అమెరికాకు చెందిన టైటాన్ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా కేంద్రం ద్వారా 2029లో స్పేస్‌లోకి అర్హత సంపాదించుకుంది. ఈ ఉమెన్ సాధించనున్న ఘనత యావత్ భారత దేశానికే గర్వకారణంగా మారనుంది.
23 ఏళ్ల చిన్న వయసులోనే తన సత్తా ఎంటో నిరూపించుకున్న జాహ్నవి.. ఆమె ఈ పొజిషన్‌లోకి రావడానికి అనేక వ్యయ ప్రయాసలు పడింది. ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని సూపర్భ్‌గా ఎదిగింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే పాఠశాల స్థాయి నుంచే అంతరిక్షంపై ఆకాశమంత మక్కువను పెంచుకుంది. తన లక్ష్యాన్ని సాధించడానికి బీటెక్ వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలను సాకారం చేసుకుంది.
అత్యంత కఠోర పరీక్షలను ఎదుర్కొని.. అంతరిక్షానికి సంబంధించిన అన్ని పరీక్షల్లో విజయం సాధించింది. తనకు సవాలు విసిరిన అన్ని పరీక్షల్లో సక్సెస్ అయ్యి.. అనేక విషయాల్లో అవగాహన పెంచుకుని ఔరా అనిపించింది. అంతరిక్షణానికి సంబంధించిన వాటిలో ప్రావీణ్యత పొంది అంతరిక్షయాత్రకు ఎంపికయ్యింది జాహ్నవి.
నాసా స్పేస్ ప్రోగ్రాంలో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలుగా దంగేటి జాహ్నవి రికార్డు సృష్టించనుంది. ఆస్ట్రోనాట్‌గా జాహ్నవి ఎంపికవ్వడం భారత్ దేశం గర్వించదగ్గ విషయం. ఈ ప్రాజెక్ట్ మరో నాలుగేళ్లలో ప్రారంభం కానుంది. మిషన్‌లో భాగంగా ఆమె రోదసిలో ప్రయాణించి రెండుసార్లు భూమిని చుట్టి వస్తుంది. ఆమె అంతరిక్ష ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూసే అవకాశాన్ని దక్కించుకోనుంది.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారాలోకేష్‌ను జాహ్నవి కలిశారు. జాహ్నవి ప్రతిభా పాటవాలను వారు కొనియాడారు. ఆమె సాధించిన ఫీట్‌ను అభినందించారు .
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారత్ తరపున ఎంపికైంది. వ్యోమగామి శిక్షణను విజవంతంగా పూర్తి చేసుకున్న ఆమె తాజాగా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్‌లో చోటుదక్కించుకుంది. అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా ఘనత సాధించింది.