Last Updated:

Israel-Hamas War: షాకింగ్ .. గర్బవతులుగా హమాస్ మహిళా బందీలు .అబార్షన్లపై కౌన్సిలింగ్

హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.

Israel-Hamas War:  షాకింగ్ .. గర్బవతులుగా హమాస్ మహిళా బందీలు .అబార్షన్లపై కౌన్సిలింగ్

Israel-Hamas War: హమాస్‌ – ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు. వారిని విడుదల చేయాలని హమాస్‌ మిలిటెంట్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మహిళలు గర్భం తొలగించుకోవాలా లేక కొనసాగించి శిశువులకు జన్మనివ్వాలా అనే మనోవేదనకు గురవుతున్నారు.

బాధితులకు కౌన్సిలింగ్..(Israel-Hamas War)

ఇలా అత్యాచాలకు గురై గర్భవతులైన మహిళల కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మెడికల్‌కేర్‌తో పాటు మెంటల్‌కేర్‌ను ప్రారంభించింది. ఇప్పుడిప్పుడు గర్భం దాల్చిన మహిళతతో పాటు ఇక డెలివరీకి సిద్దంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మహిళలకు ఇజ్రాయెల్‌లోని హోలోన్‌ పట్టణంలో ఓల్ఫ్‌సన్‌ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు గర్భం దాల్చి మహిళ పిండం స్టాటస్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు వెళ్లదలచుకోని మహిళలను, సోషల్‌ వర్కర్లు ఎప్పటికప్పుడు వారితో టచ్‌లో ఉంటూ వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. న్యూయార్కు పోస్టు సమాచారం ప్రకారం ప్రెగ్నేన్సీ టర్మినేషన్‌ కమిటి అబార్షన్‌ చేయవచ్చా లేదా అని నిర్ధారిస్తుంది. కాగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న మహిళలను అక్టోబర్ ‌7తో పాటు అటు తర్వాత కూడా అత్యాచారాలు చేసినట్లు తెలుస్తోంది.

బందీలుగా 129 మంది..

మంది..మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పాల్గొన్న యెనీ సడూన్‌ అనే యువకుడు ఆ రోజు జరిగిన దారుణాల గురించి చెప్పాడు. ఒక యువతి బట్టలు విప్పడానికి నిరాకరిస్తే తలతెగ్గొట్టారని చెప్పాడు. హమాస్‌ మిలిటెంట్ల చేతిలో అత్యాచారానికి గురై పూర్తిగా కాల్చినిర్మానుష్యప్రదేశంలో పడేసిన యువతి మృత దేహాన్ని చాలా మంది సోషల్‌ మీడియాలో చూసే ఉంటారు. ఇప్పటికి 129 మంది హమాస్‌ చేతిలో ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్‌ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌.. హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం నాలుగో నెలకు చేరనుంది. అయితే ఇటీవల హమాస్‌ చెర నుంచి విడుదలైన బాధిత మహిళ తన అనుభవాన్ని చెబుతూ 51 రోజుల పాటు ఒక్క నిమిషం కూడా తమను ప్రశాంతంగా ఉండనీయలేదు. తమపై అత్యాచాలు కొనసాగయని చెప్పారు.

హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న వారిలో 19 ఏళ్ల అమ్మాయిలున్నారు. వారి గురించి ఆలోచిస్తే వణుకుపుడుతోందని బందీల చెర నుంచి వచ్చిన వారు చెబుతున్నారు. వారిపై పలు మార్లు అత్యాచారాలు జరిగాయి. తీవ్రంగా గాయపర్చారు. వారి గురించి పట్టించుకునే నాధుడే లేడని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ తమ వద్ద బందీలుగా ఉన్న యువతులను విడుదల చేయడానికి హమాస్‌ ససేమిరా అందని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వీరు బందీలుగా ఉన్నప్పుడు జరిగిన అత్యాచారాల గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తారన్న భయంతో యువతులను బాలికలను విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారని అమెరికా అధికారులు భావిస్తున్నారు.