Bayya Sunny Yadav: జాకీర్ నాయక్ ను కలిసిన యూట్యూబర్ సన్నీ!
Bayya Sunny Yadav: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను NIA అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలో గూడచర్యం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్‌ను లాహోర్‌లో కలిసినట్టు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. ఏడు నెలల క్రితం ఓ కార్యక్రమంలో జకీర్ నాయక్‌తో భయ్యా సన్నీ యాదవ్ పాల్గొన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌లో ఎవరెవరిని కలిశారన్న కోణంలో విచారిస్తున్నారు. పాకిస్తాన్ టూర్ గురించి వివరాలను తెలుసుకుంటున్నారు.
సన్నీ యాదవ్ తండ్రితో మీడియా మాట్లాడింది. సన్నీకి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని అన్నారు. సన్నీ దేశభక్తుడని మామూలే బైక్ రైడర్ గానే వెళ్లాడని అన్నాడు. పహల్గాం ఘటనకు ముందే పాక్ నుంచి భారత్ కు తిరిగి వచ్చాడు. ఎవరు అదుపులోకి తీసుకున్నారో తెలియదన్నారు. సదరు అధికారులకు తాను సహకరిస్తానని సన్నీ తల్లిదండ్రులు తెలిపారు. సమాచారం ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. మే29న సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీనికూడా గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు.