Last Updated:

Nothing Phone 3a Price Drop: కొనండమ్మా కొనండి.. మళ్లీరాని అవకాశం.. నథింగ్ ఫోన్ 3ఏపై భారీ డిస్కౌంట్..!

Nothing Phone 3a Price Drop: కొనండమ్మా కొనండి.. మళ్లీరాని అవకాశం.. నథింగ్ ఫోన్ 3ఏపై భారీ డిస్కౌంట్..!

Nothing Phone 3a Price Drop: నథింగ్ కంపెనీ ఇటీవల భారతదేశంలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 3ఏ పేరుతో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మొబైల్ ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది నథింగ్ ఫోన్ 3ఏ ప్రోతో పాటు విడుదలైంది. సొగసైన లుక్,అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Nothing Phone 3a Price and Offer
నథింగ్ ఫోన్ 3ఏ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ కోసం ఈ ఫోన్ ధర రూ. 24,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.26,999గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్ లావాదేవీలపై రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.

Nothing Phone 3a Features And Specifications
నథింగ్ ఫోన్ 3ఏ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే1,080 x 2,392 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్,3,000 నిట్స్ పీక్ బ్రైట్నె‌కి సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్‌లో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. దీన్ని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్లలో తయారు చేశారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1తో పని చేస్తుంది. ఈ మొబైల్ గ్రాఫిక్స్ కోసం అడ్రినో 720 GPU ఉంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది.

నథింగ్ ఫోన్ 3ఏ మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది OIS సపోర్ట్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ రెండవ కెమెరా, 8-మెగాపిక్సెల్ మూడవ కెమెరాను కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. అలానే ఫోన్‌లో 50W వైర్డు ఛార్జింగ్‌తో 5000mAh కెపాసిటీ బ్యాటరీ అందించారు. ఈ మొబైల్‌కి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ చేశారు. అలాగే ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌, USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G SA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C, NFC మొదలైనవి ఉన్నాయి.