Home / Tollywood News
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.
కొంత మంది నటీనటులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతూ ఉంటారు. కానీ శ్రీలీల మొదటి సినిమాతోనే తన గ్లామర్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల తల్లి స్వర్ణలతపై FIR నమోదుకావడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత అయిన రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో తనయుడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఈ మూవీకి తేజ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను లాంఛ్ చేశారు మూవీ మేకర్స్. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరాం జంటగా గీతికా నటిస్తోంది.
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప వంటి చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బ్యూటీ రష్మిక. కాగా ఈ అందాల తార తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. చూపే బంగారమాయెనే శ్రీవల్లి అనే పాట ఈ ఫొటోలకు సరిగ్గా సెట్ అవుతుందంటూ పలువురు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ హొయలు పోతూ కెమెరాకు మంచి ఫోజులిచ్చింది. వైట్ మోనోక్రోమ్ దుస్తుల్లో దిగిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయి.
The Ghost Movie Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో నటించారు. కాగా ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఆడియన్స్ ఈ మూవీపై ఎలా స్పందిస్తున్నారో చూసేద్దామా. సినిమా కథేంటంటే.. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ […]
సీతారామమం చిత్రంలో సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాను ఈ స్టేజిలోకి రావడానికి ఎన్నోకష్టాలు పడిందట. మొదట్లో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. మరి మృణాల్ అలా ఎందుకు అనుకుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజ డైరెక్టర్లైన కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన కె.హరనాథ్ రెడ్డి "మాతృదేవోభవ"( ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా వెండి తెరపై పరిచయవుతున్నాడు. కాగా తొలి ప్రయత్నంలోనే ఈ సినిమా ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ డైరెక్టర్
ఉప్పెనతో కుర్రకారుని ఒక ఊపిన అందాల తార కృతి శెట్టి. ఆమె ఈల వేసి గోల చేసినా తింగరి సర్పంచుగా నటించినా.. ఏ పాత్రలోనైనా ఆమె అభినయం ప్రేక్షకుల చేత అదుర్స్ అనిపించింది. వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ భామ. తాజాగా నెట్టింట పోస్ట్ చేసిన ఫొటలను చూద్దామా..
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.