Home / Telangana
హైదరాబాద్ సిటీలో ప్రజలకు అలర్ట్. రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
సుమారు రూ.300 కోట్ల అవకతవకలు జరిగి అక్రమాల పుట్టగా మారిన చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సీబీఐ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ డిమాండ్ చేసారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.
మీడియా కలుషితం అయ్యిందని నిందిస్తూ, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ కూర్చోకుండా ప్రతి విద్యావంతుడు సమాచార వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు డాక్టర్ ఎస్. రాము హితవు పలికారు.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికల ఆలోచన పెట్టుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీనేతలకు చెప్పారు.