Home / Telangana
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆమెకు శిరో్మండనం చేయించిన దారుణ ఘటన వెలుగు చూసింది.
తెలంగాణలో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించనున్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కామెంట్స్ చేశారు.
మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు
దేశ ప్రధాని రాష్ట్రానికి, అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. అయితే, మోదీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చెయ్యదని ఆ ఆలోచన కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.