Home / Russia
Russia: రష్యాలో వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో రొస్తోవ్ నగరం నుంచి తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఎట్టకేలకు కనిపించారు. సోమవారంనాడు ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించారు దీనిపై ఆ దేశ రక్షణ శాఖ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Putin-Wagner: తాను పెంచిపోషించిన పాము తననే కాటువెయ్యాలని చూసిందనే సామెంత చందంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏర్పాటు చేసిన వాగ్నర్ సైన్యం ఆఖరి వారిమీదే తిరుగుబాటుకు కాలు దువ్వింది. రష్యా రక్షణ మంత్రిపై యెవ్జెనీ ప్రిగోజిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉక్రెయిన్పై సోమవారం రాత్రి భారీ ఎత్తున క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల దెబ్బకు రాత్రి మొత్తం ఉక్రెయిన్ నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రష్యా నియంత్రణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్లో సోవియట్ కాలం నాటి భారీ కట్టడం అయిన నోవా కఖోవ్కా డ్యామ్ వీడియో తెగిపోయినట్లు వీడియో వైరల్ అయింది. రష్యా, ఉక్రెయిన్లు ఉద్దేశపూర్వక దాడికి పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.వీడియోలు డ్యామ్ అవశేషాల గుండా నీరు ప్రవహించడాన్ని చూపించాయి.
2019లో నార్వేలో తిరిగిన బెలూగా తిమింగలం స్వీడన్ తీరంలో మళ్లీ కనిపించింది.ఇది రష్యన్ నావికాదళం ద్వారా శిక్షణ పొందిన గూఢచారి అని ఊహాగానాలకు దారితీసింది, మానవ నిర్మిత జీను కారణంగా తిమింగలం రష్యా నావికాదళం ద్వారా శిక్షణ పొందిందని ఊహాగానాలు చెలరేగాయి.
రష్యా కీలక భవనాలు ఉండే క్రెమ్లిన్పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది.