Home / Operation Sindoor
2 Terrorist arrested in Vizianagaram: విజయనగరంలో బాంబుపేలుళ్లతో అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ విజయనగరం, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో నిందితులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా.. […]
Rahul Gandhi questioned Jai Shankar: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ పై భారత్ చేసిన దాడిలో మన యుద్ద విమానాలను ఎన్ని కోల్పోయామో లెక్కచెప్పాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. వరుసగా మూడు రోజులుగా ట్వీట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ పై దాడి చేస్తామని మనం ముందుగానే సమాచారం ఇవ్వడం నేరమన్నారు. ఈ అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని జైశంకర్ ను ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి మౌనం సరికాదన్నారు. ఎక్స్ లో ఆయన రాస్తూ.. “మరోసారి అడుగుతున్నాను. […]
UP Person Arrested due to Spying For Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే దాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టింది. అనంతరం భారత- పాక్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. చివరికి కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో దాడులు ఆగిపోయాయి. మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు […]
MP Purandeshwari has a chance in seven all-party groups : భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాక్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి చోటు దక్కింది. మొత్తం 59 మందితో ఏడు అఖిలపక్ష బృందాలు.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటన నేపథ్యంలో ఇండియా చేపట్టిన ఆపరేషన్ […]
Pakistan: భారత్- పాక్ ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత్ ప్రపంచ దేశాల ముందు నిజాలను బయటపెట్టింది. అయితే తమ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా 20 వేల కోట్ల పాకిస్తాన్ రూపాయల ఆర్థిక సాయం చేయాలని దాయాది దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ను కోరింది. కానీ పాకిస్తాన్ కోరిన ఆర్థిక సాయాన్ని ఆ దేశానికి ఇవ్వొద్దని భారత్ గట్టిగా అడ్డుకొంది. ఆ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే […]
Operation Sindoor : భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. ఏడుగురు వీరే.. కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్, బీజేపీ పార్టీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీ-యూ నుంచి సంజయ్‌కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ-ఎస్పీ నుంచి […]
Operation Sindoor: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమంటే పాకిస్తాన్ పనులను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ నష్టపోయేది నక్కే అన్న చందంగా. భారత్ చేస్తున్న చర్యలకు పోలికగా పాకిస్తాన్ అలానే చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి పనులు చేసి ప్రపంచం ముందు నవ్వులపాలైనా ఆ దేశానికి ఇంకా బుద్ధి రావడంలేదు. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు నిర్ధారించుకున్న భారత్.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు […]
Operation Sindoor: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో దాయది దేశానికి పెద్ద నష్టమే జరిగింది. భారత్ దాడులకు భయపడి.. మన భద్రతా బలగాల ముందు నిలవలేకపోయింది. చివరికి తమని తాము కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఆందోళన పరిస్థితులు మరింత పెరిగాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది చంపేశారు. ఈ దాడుల […]
India- Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడులకు సమాధానంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో 100 మందికిపైగా జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు […]
All party delegations to carry forth to the world india strong message of zero tolerance against terrorism: పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లో కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో నక్కిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ ప్రతీకార దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. […]