Home / latest political news
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది. అతడిని అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పింది.
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ 'సంకల్ప్ పత్ర' లేదా 'మేనిఫెస్టో'ని విడుదల చేసారు.
రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తేనే.. ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు.. లేకుంటే అధికారంలో నుంచి పోవాలనే మేసేజ్ పోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.
హిమాచల్‌ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న బాధలు ఓవైపు, మరో వైపు సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 365రోజుల పాదయాత్రకు రంగం సిద్ధమైంది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనల నేపధ్యంలో లో ఏసీపీ మోహన్‌రావు పై సస్పెన్షన్ వేటు పడింది.