Home / Jammu and Kashmir
A Man To Have Helped Terrorists In Pahalgam Attack Jumps Into River: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఉగ్రవాదులకు సహకరించిన 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను భద్రతా బలగాలే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించేందుకు అతడిని తీసుకెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా బలగాల నుంచి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంగ్మార్గ్కు చెందిన ఇంతియాజ్ పారిపోయే తరుణంలో ఓ నదిలోకి దూకేశాడు. […]
Terror Strike attempt chance In Jammu and srinagar jails: జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఐదు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్, జమ్ములోని జైళ్ల లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. కాగా, జమ్మూకశ్మీర్ జైళ్లలో హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత […]
India to Meet Today India-Pakistan Tensions: యూఎన్ఎస్సీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను యూఎన్ఎస్సీ చర్చించనుంది. ఈ ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్‌ను పాక్ కోరింది. భారత్ చర్యలు శాంతిభ్రదతలకు హాని కలిగిస్తున్నాయని పేర్కొంది. అయితే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి అంశాలను యూఎన్ఎస్సీ దృష్టికి పాక్ తీసుకెళ్లనుంది. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని యూఎన్ఎస్సీ దృష్టికి భారత్ తీసుకెళ్లనుంది. […]
Indian Army Vehicle Falls Into Gorge three Soldiers Dead: జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందని ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 11.30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 44 వెంట శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడింది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని రంగజభన్ జిల్లాలో రాంభవ్ వద్ద 700 అడుగుల లోతైన లోయలో […]
Pahalgam: పహల్గామ్ ఉగ్రదాడికి వారం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. స్లీపర్ సెల్స్ యాక్టీవ్ అయ్యారంటూ బలగాలు తెలిపాయి. కాశ్మీర్ లోయలో 87 టూరిస్ట్ ప్రదేశాల్లో 48 ప్లేసులను క్లోజ్ చేశారు. అదనపు భద్రత కల్పించిన తర్వాతే వాటిని రి ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే అన్ని చోట్లకు పర్యాటకులను అనుమతిస్తామన్నారు. ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతాబలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. బైసరన్ లోయలో ఉగ్రవాదుల […]
Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత వినిపించింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ పాకిస్థాన్ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కుప్వారా, బరాముల్లా జిల్లాలతో పాటు అభ్నూర్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ పాల్పడిన […]
Jammu and Kashmir CM Omar Abdullah : పహల్గాంలో అతిథులను కాపాడుకోవటంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు. 26 మంది ప్రాణాలను అడ్డంపెట్టుకొని తాను రాష్ట్రానికి సంబంధించిన హోదాను డిమాండ్ చేయబోనని స్పష్టం చేశారు. జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు డిమాండ్ సరికాదని, మరో రోజు డిమాండ్‌ను లేవనెత్తుతానని చెప్పారు. అసెంబ్లీ అత్యవసర సమావేశం.. ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ […]
Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మరువముందే టెర్రరిస్టులు మరో రెచ్చిపోయారు. ఈ మేరకు ఉగ్రదాడికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ సామాజిక యాక్టివిస్ట్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కుప్వారా ప్రాంతంలో సోషల్ యాక్టివిస్ట్‌గా 45 ఏళ్ల రసూల్ మాగ్రే నివసిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా ఆయన ఇంటిపై ఎవరూ లేని సమయంలో కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో […]
Indian Solder killed in Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డూడూ-బసంత్‌గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తరాస పడడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చికిత్స పొందుదూ జవాన్ మృతి.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడికి మెడికల్ టీమ్ సభ్యులు […]
High-Level Security Meet : జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతిచెందారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్యగ అభివర్ణించారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర […]