Home / Hamas
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
గాజా స్ట్రిప్ ప్రాంగణంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుండి శరణార్థుల కోసం ఉద్దేశించిన ఇంధనం మరియు వైద్య సామాగ్రిని హమాస్ దొంగిలించిందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) తెలిపింది.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.