Home / BJP
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో 'మోదీ నో ఎంట్రీ' అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.NewsTelanganaHyderabadP
1991 సంస్కరణలను "హాఫ్ బేక్డ్ " అంటూ కొన్ని వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బుధవారం విరుచుకుపడింది. "మాస్టర్ చెఫ్" నితిన్ గడ్కరీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పొగడటం ద్వారా దానిని పూర్తిగా తయారు చేసారని అంది.
భాజపా భీష్ముడు, రామ జన్మభూమి కోసం రధయాత్రను చేపట్టిన కీలకధారి లాల్ కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దేశంలో బీజేపీ దుర్మార్గాలు చేస్తుంది.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.