Home / AP Politics
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే జైలు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే పలు వేదికలపై భాహాటంగానే పవన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీ సీఎం జగన్ నిన్న సామర్లకోటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పవన్ పెళ్ళిళ్ళపై మళ్ళీ కామెంట్స్ చేసిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు.
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.