Home / Ap latest news
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం నేడు కడప వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.
త్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నాటి బీహార్ ను తలపిస్తుందంటూ విమర్శించారు.