Last Updated:

Sanju Samson: రాజస్తాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో భాగంగా చెన్నై చెపాక్‌ వేదికగా సీఎస్కే తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

Sanju Samson: రాజస్తాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు

Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో భాగంగా చెన్నై చెపాక్‌ వేదికగా సీఎస్కే తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు అందుకుంది. దీంతో ఐపీఎల్ టేబుల్‌ లో టాపర్‌గా నిలిచింది. అదే విధంగా చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ కు ఇదే తొలి గెలుపు. కాగా, విక్టరీ జోషల్‌లో ఉన్న ఆర్ఆర్ కు ఊహించని షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాజస్తాన్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు.

 

మొదటి తప్పుగా..(Sanju Samson)

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్ ఆర్ చేసిన మొదటి తప్పు కారణంగా శాంసన్‌కు రూ. 12 లక్షల జరిమానా మాత్రమే పడింది. బుధవారం మ్యాచ్లో చివరి ఓవర్ ను సందీప్ శర్మ వేశాడు. అయితే నిర్ణీత సమయంలో చివరి ఓవర్ పూర్తి కాకపోవడంతో ఐపీఎల్‌ నిర్వహకులు ఈ ఫైన్‌ విధించారు. ఇలాంటి తప్పు రెండోసారి జరిగితే రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూపై ఒక్క మ్యాచ్‌ నిషేధం పడుతుంది.

 

రెండో కెఫ్టెన్ గా శాంసన్

మరో వైపు ఈ సీజన్‌లో ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్ కు జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్ తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. దీంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. తొలి తప్పిదం కావడంతో రూ. 12 లక్షల జరిమానా విధించాడు. ఈ సీజన్ జరిమానా ఎదుర్కొన్న తొలి కెఫ్టెన్ గా డుప్లెసిస్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండో కెప్టెన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. కాగా ఐపీఎల్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా శాంసన్‌కు జరిమానా విధించడం ఇదేమి తొలిసారి కాదు. 2021 ఐపీఎల్ లో రెండు సార్లు అతడిపై జరిమానా పడింది.

 

చెపాక్ లో అద్భుతం

చెపాక్ స్టేడియంలో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్కే చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్ ను ఆఖరి బంతి వరకు ఊరించి లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది. మొదట టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.