Last Updated:

RR vs KKR : జైస్వాల్ మాస్ విధ్వంసం.. కోల్‌క‌తా పై రికార్డు బ్రేక్ విక్టరీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2023 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ తలపడింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌క‌తా నిర్ధేశించిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 13.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించి ఐపీఎల్ లో రెండో రికార్డు బ్రేక్ విక్టరీ సాధించారు. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ బ‌ట్ల‌ర్ డ‌కౌట్ కాగా

RR vs KKR : జైస్వాల్ మాస్ విధ్వంసం.. కోల్‌క‌తా పై రికార్డు బ్రేక్ విక్టరీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్

RR vs KKR : ఐపీఎల్ 2023 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ తలపడింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌క‌తా నిర్ధేశించిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 13.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించి ఐపీఎల్ లో రెండో రికార్డు బ్రేక్ విక్టరీ సాధించారు. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ బ‌ట్ల‌ర్ డ‌కౌట్ కాగా మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌ (98 నాటౌట్; 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించాడు.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (RR vs KKR)..

ముఖ్యంగా య‌శ‌స్వి జైస్వాల్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగ‌వంత‌మైన అర్ధ‌శ‌త‌కాన్ని త‌న పేరున లిఖించుకున్నాడు. నితీశ్ రాణా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లోనే  6, 6, 4, 4, 2, 4తో 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్‌లో హర్షిత్ రాణాకి కూడా చివర్లో 4, 6 తప్పలేదు. ఇక మూడో ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన యశస్వి 13 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ లీగ్ లో ఒక ఇన్నింగ్స్ లోని పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సురేశ్ రైనా (87),  గిల్‌క్రిస్ట్ (74), ఇషాన్ (63) ల తర్వాత యశస్వి (62) నిలిచాడు.  అదే విధంగా కేవలం 13 బంతుల్లోనే జైస్వాల్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఇంత‌క‌ముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్(14 బంతుల్లో) పేరిట ఉండేది.

అలానే కెప్టెన్ సంజు శాంస‌న్ (48 నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడ‌డంతో రాజ‌స్థాన్ అల‌వోక‌గా విజ‌యాన్ని అందుకుంది. వీరు రెండో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించారు. ఆఖర్లో సెంచరీ దగ్గరలో కూడా యశస్వి జైస్వాల్ జట్టు ప్రయోజనాల కోసం మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. శతకానికి రెండు పరుగులు దూరంలో ఆగిపోయాడు. ఈ విజ‌యంతో రాజ‌స్థాన్ త‌న ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను సజీవంగా ఉంచుకోగా కోల్‌క‌తా ప్లే ఆఫ్స్ ఆశలు కష్టంగా మారాయి.

 

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(57; 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్‌(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు ప‌ర్వాలేనిపించ‌గా జేస‌న్ రాయ్‌(10), ర‌స్సెల్ (10) లు విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శ‌ర్మ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ మ్యాచ్ లో కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 13.1 ఓవర్లలోనే  ఛేదించింది. మరో 41 బంతులు మిగిలుండగానే  150 ప్లస్  టార్గెట్ ను ఛేదించిన రాజస్తాన్.. గతంలో  ముంబై (37 బంతులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.