Last Updated:

IPL 2023 RR vs GT: విజృంభించిన గుజరాత్ స్పిన్నర్స్.. 118 కే కుప్పకూలిన ఆర్ ఆర్

ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటిసారి ఆడినప్పుడు రాజస్థాన్ విజయం సాధించింది. ఇపుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ బరిలోకి దిగింది.

IPL 2023 RR vs GT: విజృంభించిన గుజరాత్ స్పిన్నర్స్.. 118 కే కుప్పకూలిన ఆర్ ఆర్

IPL 2023 RR vs GT: ఐపీఎల్ 2023 లో జయపుర వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ 118 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత టాస్ నెగ్గిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్ బ్యాటర్స్ ఎవరూ కూడా రాణించలేక పోయారు. కెప్టెన్ సంజూ శాంసన్ (30), చివర్లో ట్రెంట్ బౌల్ట్ (15) పర్వాలేదనిపించడంతో 100 పరుగులైనా దాటగలిగారు. దీంతో గుజరాత్ కు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చారు. జయపుర స్టేడియంలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్దిక్ పాండ్యా, లిటిల్ లు తలో వికెట్ తీసుకున్నారు.

 

తుది జట్లు( IPL 2023 RR vs GT)

 

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ ( కెఫ్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్‌ హెట్‌మైర్‌, దృవ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ, ఆడమ్‌ జంపా, చహల్‌

సబ్ స్టిట్యూట్లు: మురుగన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్, కేఎం అసిఫ్, జో రూట్ , రియాన్ పరాగ్

 

గుజరాత్‌ టైటాన్స్‌: హార్ధిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, నూర్‌ అహ్మద్‌, జాషువ లిటిల్‌, మోహిత్‌ శర్మ

సబ్ స్టిట్యూట్లు: శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రవి శ్రీనివాసన్ సాయి కిశోర్, శివమ్ మావి

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 05 May 2023 09:13 PM (IST)

    RR vs GT: ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్

    రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో ఆర్ ఆర్ 118 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి వికెట్ కు అభినవ్ మనోహర్ అద్భుతమైన త్రో వేయడంతో ఆడమ్ జంపా (7) రనౌట్ అయ్యాడు. దీంతో 17.5 ఓవర్లకు రాజస్థాన్ ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ ఎదుట 119 పరుగుల స్వల్ప లక్ష్మాన్ని ఉంచింది.

  • 05 May 2023 09:10 PM (IST)

    RR vs GT: 16.3 ఓవర్లకు 112/9.. క్లీన్ బౌల్డ్ గా బౌల్ట్

    112 పరుగుల వద్ద ఆర్ఆర్ 9 వ వికెట్ నష్టపోయింది. మహమ్మద్ షమీ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్(15) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో సందీప్, ఆడమ్ జంపా ఉన్నారు.

  • 05 May 2023 08:55 PM (IST)

    RR vs GT: హెట్ మెయిర్ అవుట్.. 15 ఓవర్లకు 100/8

    వరుస వికెట్లతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కీలకమైన హెట్ మెయిర్ కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో 14.1 ఓవర్లలో వికెట్ నష్టపోవాల్సి వచ్చింది. దీంతో రాజస్థాన్ 15 ఓవర్లకు 100/8 గా ఉంది.

  • 05 May 2023 08:52 PM (IST)

    RR vs GT: నూర్ అహ్మద్ ఖాతాలో మరో వికెట్

    నూర్ అహ్మద్ వేసిన బంతితో జురెల్(9) కూడా క్రీజును వదలక తప్పలేదు. ముందు అంఫైర్ ఔట్ గా ప్రకటించిగా.. ఆర్ ఆర్ డీఆర్ఎస్ కు వెళ్లింది. అయితే, రివ్వూ లో జురెల్ ఔట్ గా తేలడంతో 13.1 ఓవర్ లో రాజస్థాన్ ఏడో వికిట్ కోల్పోయింది.

  • 05 May 2023 08:44 PM (IST)

    RR vs GT: సగం వికెట్లు కోల్పయిన రాజస్థాన్

    రాజస్థాన్ కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆచితూచి ఆడుతున్న పడిక్కల్(12) వికెట్ పడింది. నూర్ అహ్మద్ వేసిన మూడో బంతికే పడిక్కిల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 11.3 ఓవర్లలో 77 పరుగుల వద్ద ఆర్ ఆర్ 6 వ వికెట్ ను కోల్పోయింది.

  • 05 May 2023 08:29 PM (IST)

    RR vs GT: 10 ఓవర్లకు రాజస్థాన్ 74/5

    రాజస్థాన్ 5 వ వికెట్ కూడా పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రియాన్ పరాగ్ (4) రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 69 పరుగుల వద్ద 5 వికెట్లు నష్టపోయింది. క్రీజులో పడిక్కల్ , హెట్ మెయిర్ ఉన్నారు. 10.2 ఓవర్లకు స్కోర్ 74/5.

  • 05 May 2023 08:20 PM (IST)

    RR vs GT: కష్టాల్లో పడ్డ రాజస్థాన్.. 4 వికెట్లు డౌన్

    రాజస్ధాన్ కు షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కీలక ఆటగాడు సంజూ శాంసన్ (30) పెవిలియన్ చేరాడు. దీంతో 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఆర్ఆర్. అనంతరం అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలవ లేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో పడిక్కల్ (7), ఇంఫాక్ట్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఉన్నారు. స్కోర్ 8 ఓవర్లకు 63/4.

  • 05 May 2023 08:12 PM (IST)

    RR vs GT:5 యశస్వి రనౌట్

    రాజస్థాన్ రెండో వికెట్ నష్టపోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో రనౌట్ గా నిలిచి పెవిలియన్ చేరాడు. ఈ ఓవరల్లో కేవలం 3 పరుగులే వచ్చాయి. దీంతో రాజస్థాన్ స్కోరు 50/2 కి చేరింది. క్రీజ్ లో సంజూతో పాటు దేవదత్ పడిక్కల్ ఉన్నాడు.

  • 05 May 2023 08:08 PM (IST)

    RR vs GT: 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 47/1

    మహమ్మద్ షమీ వేసిన 5 వ ఓవర్లో సంజూ సాంజన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్ లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. దీంతో రాజస్థాన్ స్కోర్ 47/1. అంతకుముందు 4 ఓవర్లో హార్థిక పాండ్యా బౌలింగ్ లో సంజూ ఎదురు దాడి చేశాడు. మొదటి 2 బంతుల్లోనే 4, సిక్స్ లు బాదాడు. 4 ఓవర్ లో ఏకంగా 13 పరుగులు వచ్చాయి.

  • 05 May 2023 08:04 PM (IST)

    RR vs GT: తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. జీటీ కెఫ్టెన్ హార్ధిక్‌ పాండ్యా కీలక వికెట్ తీసుకున్నాడు. హార్థిక్ బౌలింగ్ లో మోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ (8) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ స్కోర్‌ 12/1. యశస్వి, సంజూ శాంసన్‌ క్రీజ్‌లో ఉన్నారు.