Last Updated:

Bichagadu 2 Movie Review : విజయ్ ఆంటోని “బిచ్చగాడు 2” మూవీ రివ్యూ.. చెల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా ?

Bichagadu 2 Movie Review : విజయ్ ఆంటోని “బిచ్చగాడు 2” మూవీ రివ్యూ.. చెల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా ?

Cast & Crew

  • విజయ్ ఆంటోని (Hero)
  • కావ్య థాపర్ (Heroine)
  • రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు (Cast)
  • విజయ్ ఆంటోని (Director)
  • ఫాతిమా విజయ్ (Producer)
  • విజయ్ ఆంటోని (Music)
  • ఓమ్ నారాయణ్ (Cinematography)
2.7

Bichagadu 2 Movie Review : ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నకిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చినా కానీ.. 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. కాగా ఇప్పుడు బిచ్చగాడుకు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ తో హీరో విజయ్ ఆంటోని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  కాగా, బిచ్చగాడు సినిమాకు శశీ దర్శకత్వం వహించారు. అయితే బిచ్చగాడు 2 కు ప్రియ కృష్ణస్వామి డైరెక్షన్ చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అదే విధంగా విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై విజయ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా పాన్ ఇండియా రేంజ్ లో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ఈ తరుణంలో బిచ్చగాడు 2 మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

ఇండియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ)ది ఏడో స్థానం! ఎన్నికల ఫండ్ పేరుతో సీఎంకు రూ. 5000 కోట్లు ఫండ్ ఇచ్చిన వ్యక్తి. అయితే, విజయ్ ఆస్తి మీద ఆయన స్నేహితుడు, కంపెనీలో పని చేసే అరవింద్ (దేవ్ గిల్) కన్ను పడుతుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో డాక్టర్ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెప్పింది వింటాడు. విజయ్ గురుమూర్తిని చంపేసి, అతని బాడీలో వేరొకరి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి, ఆస్థి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. విజయ్ గురుమూర్తి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వ్యక్తి సత్య (విజయ్ ఆంటోనీ) దొరుకుతాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు బాడీ మాత్రం విజయ్ గురుమూర్తిది. బ్రెయిన్ ఏమో సత్యాది.

విజయ్ గురుమూర్తి స్థానంలో సత్య బ్రెయిన్ వస్తే… తాము ఆడింది ఆట, పాడింది పాట అనుకున్న అరవింద్ & కోకు పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళను సత్య చంపేస్తాడు. ఎందుకు? అతని చెల్లెలు ఎవరు? చిన్నతనంలో జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఆ బాడీ విజయ్ గురుమూర్తిది అయినా… అందులోని బ్రెయిన్ సత్యాది అని జనాలు కనిపెట్టారా? లేదా? విజయ్ గుర్తుమూర్తి ప్రేమించిన అమ్మాయి, కంపెనీలో సెక్రటరీ హేమ (కావ్యా థాపర్) సహా ఎవరికీ అనుమానం రాలేదా? సత్య స్టార్ట్ చేసిన యాంటీ బికిలీ కార్యక్రమం ఏమిటి? ముఖ్యమంత్రి (రాధా రవి) అతడిని ఎందుకు చంపాలి? అనుకుంటున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Bichagadu 2 (2023) Telugu Movie

మూవీ విశ్లేషణ (Bichagadu 2 Movie Review)..

అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో బిచ్చగాడు మూవీ రాగా.. ఇప్పుడు చెల్లి సెంటిమెంట్ తో ‘బిచ్చగాడు 2’ చేశారు. అయితే.. రెండు కథల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండో కథలో కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, థ్రిల్ ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయి. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్, సర్జరీ అంటూ సినిమా ప్రారంభమే విజయ్ ఆంటోనీ చాలా ఆసక్తి కలిగించారు. ఇంటర్వెల్ వరకు ఆ టెంపో కంటిన్యూ అయ్యింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ కలిగించారు. ఇంటర్వెల్ తర్వాత ఆ టెంపో మిస్ అయ్యింది. సామాజిక సేవ, సందేశం మీద దృష్టి పెట్టడంతో అసలు కథ పక్కకు వెళ్ళింది. యాక్షన్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాలన్స్ చేయడంలో విజయ్ ఆంటోనీ కొంచెం తడబడ్డారు. ఫస్టాఫ్ వరకు చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్న ఆయన.. ప్రీ క్లైమాక్స్ దాకా అలా పడుతూ లేస్తూ వచ్చిన కథ ..సీఎం సీన్ లోకి వచ్చి …ఎటాక్ బిచ్చగాడు అనే ఎజెండా పెట్టుకుని ,రౌడులు పంపటం, ఫైట్స్ వంటివి చేసినప్పుడు మళ్లీ ఊపందుకుంటుంది. క్లైమాక్స్ లో కోర్టు సీన్, చెల్లి కనపడినప్పుడు వచ్చే ఎమోషన్ సీన్ వంటివి బాగా డిజైన్ చేసారు. అలాగే ఈ స్టోరీలో బిక్షమెత్తుకునే పిల్లలను కిడ్నాప్ చేసే పెద్ద మనుషులు.. వారితో ఏం చేస్తున్నారనే విషయాన్ని తెరపై చక్కగా ప్రజెంట్ చేసారు. ఓవరాల్ గా చెల్లి ఎమోషన్ ని బలంగా నమ్ముకుని , చిన్న పిక్షన్ ని కలుపుకుని బాగానే ప్రయత్నం చేసారు. మరి కొంత దృష్టి పెట్టి ఉంటే బిచ్చగాడుని మించి హిట్ అయ్యేది.

నటీనటులు ఎలా చేశారంటే..

విజయ్ ఆంటోనీలోని నటుడిగా మరో మెట్టు ఎక్కారు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగభరిత సన్నివేశాలలో విజయ్ ఆంటోనీ జీవించేశారు. ‘బిచ్చగాడు 2’ చూస్తే దర్శకుడిగా ఇది విజయ్ ఆంటోనీ తొలి సినిమా అని ఎక్కడా అనిపించదు. బాగా డీల్ చేశారు. ముఖ్యంగా ఆయన సంగీతం, ఎడిటింగ్ చాలా హెల్ప్ అయ్యాయి. పాటలు పక్కన పెడితే.. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ పెద్ద సినిమా అని ఫీలింగ్ కలిగించింది. నిర్మాణ పరంగా రాజీ పడలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో కావ్యా థాపర్ అందాల ప్రదర్శన చేశారు. ఆ తర్వాత నటిగానూ మెరిశారు. చాలా రోజుల తర్వాత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు దేవ్ గిల్. రాధా రవి, జాన్ విజయ్, హరీష్ పేరడి, మన్సూర్ అలీ ఖాన్. యోగిబాబు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

కంక్లూజన్.. 

ఈసారి సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా

 

ఇవి కూడా చదవండి: