Michael Movie Review : యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం సందీప్ నటించిన పాన్ ఇండియా మూవీ “మైకేల్”.
ఈ సినిమా రంజిత్ జైకోడి దర్శకత్వంలో వస్తుండగా.. ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి మరియు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.
చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్.సత్యనారాయణన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
నేడు ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో.. మీకోసం ప్రత్యేకంగా..
చిన్నపటి నుండే పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలనే కలతో పెరుగుతాడు మైఖేల్. అనుకున్నట్టుగానే కొంచెం వయసొచ్చాక ఒక గ్యాంగ్ లో చేరుతాడు.
ముంబై మాఫియా సామ్రాజ్యానికి గురునాథ్ (గౌతమ్ మీనన్) తిరుగులేని రాజు. అతడిని భారీ ఎటాక్ నుంచి మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడతాడు.
ఆ తర్వాత గురునాథ్ నమ్మదగిన వ్యక్తుల్లో మైఖేల్ ఒకడవుతాడు.
తనపై ఎటాక్ ప్లాన్ చేసిన వ్యక్తుల్లో రతన్ (అనీష్ కురువిల్లా) ను తప్ప మిగతా అందరినీ చంపేసిన గురునాథ్, అతడిని చంపే బాధ్యత మైఖేల్ చేతిలో పెడతారు.
రతన్‌ను పట్టుకోవడం కోసం ఆమె కుమార్తె తీర (దివ్యాంశ కౌశిక్)ను ఫాలో అవుతాడు మైఖేల్. ఆ క్రమంలో ఒక్కటవుతారు.
రతన్ చేతికి దొరికినా మైఖేల్ చంపకుండా వదిలేస్తాడు.
ఎందుకు అని అతన్ని వదిలేశాడు? ఆ విషయం తెలిసిన గురునాథ్ ఏం చేశాడు?
మైఖేల్ చావాలని గురునాథ్ కుమారుడు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ) పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి?
విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు ఏమిటి? చివరకు, మైఖేల్ ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
1980-90ల మధ్య కాలంలో ఓ గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో సెట్ చేసిన కథ ఇది.
దీనికి ప్రేమతో పాటు తల్లి సెంట్‌మెంట్‌ను జోడించి భావోద్వేగభరితంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
చరిత్రలో యుద్ధాలన్నీ మగువ కోసమే జరిగాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
ఈ చిత్ర కథా నేపథ్యం కూడా అదేనని ప్రచార చిత్రాలతోనే స్పష్టత ఇచ్చారు దర్శకుడు.
అయితే టీజర్, ట్రైలర్లలో ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు చేసిన మారణకాండలా దీన్ని చూపించారు.
కానీ, నిజానికి ఇందులో మరో ఆసక్తికర కథ కూడా దాగి ఉంది. అదేంటన్నది తెరపైనే చూడాలి.
‘మైఖేల్’లో సందీప్ కిషన్ నోటి వెంట వచ్చిన డైలాగులు చాలా అంటే చాలా తక్కువ.
అందులోనూ ముందు ముందుగా ‘ఒక ఆడపిల్ల ముందు చేయి వేసే ముందు గుర్తు రావాలి… అమ్మ’ అని ఓ డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
అలానే “మైఖేల్” కథ, కథనాలు కొత్త కాకపోవచ్చు.
కథను చెప్పిన తీరు ‘కెజిఎఫ్’ను గుర్తు చేయవచ్చు.
అయితే… కథ ముందుకు వెళుతున్న కొలదీ కథకు కనెక్ట్ అవుతూ ఉంటాం.
ఆ మేకింగ్ & ట్రీట్మెంట్, నేపథ్య సంగీతం మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది.
రెట్రో స్టైల్‌లో బాగా తీశారు. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ బాగా నచ్చుతుంది.
కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బావుంది. కథా నేపథ్యానికి తగ్గట్టు లైటింగ్ థీమ్, కలర్ గ్రేడింగ్ చక్కగా చేశారు.
సామ్ సిఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం బావుంది. డైలాగులు, హీరోకి ఇచ్చే ఎలివేషన్లు, సీన్లు… ప్రతి దాంట్లో ‘కెజిఎఫ్’ప్రభావం కనపడుతుంది.
కానీ సినిమా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
సందీప్ కిషన్ … గుండెల్లో అంతులేని బాధను బయటపెట్టలేని యువకుడిగా బాగా నటించారు.
నటుడిగా సందీప్ కిషన్ మాస్ మరో మెట్టు ఎక్కేశాడని చెప్పాలి. దివ్యాంశ కౌశిక్ ఓకే అనిపించింది.
మాఫియా డాన్ పాత్రలో గౌతమ్ మీనన్ బాగా నటించారు.
‘మైఖేల్’తో వరుణ్ సందేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోవచ్చు అనే నమ్మకం కలిగించాడు.
అనసూయ క్యారెక్టర్ కొంచెం సర్‌ప్రైజ్ చేస్తుంది. వరుణ్ సందేశ్ తల్లిగా, గౌతమ్ మీనన్ భార్యగా ఆవిడ కనిపించారు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించేది తక్కువే అయినా.. అదరగొట్టారు అని చెప్పాలి.
వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతుపతితో చేసే సీన్స్ బావుంటాయి.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/