Site icon Prime9

Vijay Sethupathi : షాకింగ్ లుక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న ” విజయ్ సేతుపతి “

vijay-sethupathi-new look goes viral on social media

vijay-sethupathi-new look goes viral on social media

Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఉప్పెన, సైరా సినిమాల్లో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు విజయ్. ఇక దలపతి విజయ్ హీరోగా వచ్చిన ” మాస్టర్ ” సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలతో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఇటీవలే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో నటించి పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. కేవలం హీరో గానే కాకుండా, పాత్ర బలాన్ని బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉంటారు విజయ్.

ప్రస్తుతం ఆయన వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే అభిమానుల తోనూ, తోటి నటీనటుల తోనూ విజయ్ ఎంత ప్రేమగా ఉంటారో చాలా సందర్భాల్లో చూశాం. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల సరసన నటించి వారి హృదయాలను గెలుచుకున్నాడు విజయ్. అయితే తన సినిమా కెరీర్ లో ఎప్పుడు వివాదాలకు, ట్రోలింగ్స్ కి దూరంగా ఉంటూ ఉంటారు.

అయితే ఆయన చివరి చిత్రం విక్రమ్ లో లావుగా ఉన్నారని, హీరోకి ఉండే ఫిజిక్ కాదని ఇటీవల పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ముఖ్యంగా విక్రమ్ సినిమాలో షర్ట్ లేకుండా వచ్చే సీన్ అయితే ఊర మాస్ అని చెప్పాలి. ఆ సీన్ ని చూసిన వారంతా సూపర్ అంటుంటే కొంతమంది మాత్రం విజయ్ పై ట్రోలింగ్ చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా తన ఫిజిక్ పై వస్తున్న కామెంట్లు అన్నింటికీ ఒక్క పోస్ట్ తో సమాధానం ఇచ్చేశాడు ,మక్కల్ సెల్వన్. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సెల్ఫీ దిగుతున్న ఫోటోను విజయ్ పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో వైట్ షర్ట్ ధరించి సన్నగా మారినట్లు కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో విజయ్ సేతుపతి అభిమనులంతా ఆ పిక్ ని షేర్ చేస్తూ పోస్ట్ లు పెడుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

 

Exit mobile version