Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు చరణ్ క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల పలువురు హీరోల ట్రైలర్ లను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించి సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు ట్రైలర్ ని కూడా రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించారు. అలానే అభిమనులతో షారూఖ్ చిట్ చాట్ నిర్వహించినప్పుడు కూడా రామ్ చరణ్ గురించి షారూఖ్ ప్రస్తావించడం.. ఆస్కార్ గనుక తీసుకువస్తే తనని ఒక్కసారి ముట్టుకొనివ్వమని అడగడం హాట్ టాపిక్ గా మారాయి.
మొదట అల్లు అర్జున్.. ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan Tej)..
అయితే ఇప్పుడు ఏకంగా షారుఖ్ కొత్త సినిమాలో రామ్ చరణ్ ని గెస్ట్ రోల్ చేయించడానికి మేకర్స్ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కింగ్ ఖాన్ షారుఖ్ తో అట్లీ ‘జవాన్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తేరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ వసూళ్ళలో బాహుబలి 2నే అధికమించి అతిపెద్ద విజయంగా అవతరించింది. దీనితో జవాన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తాడని కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ఆ రోల్ చరణ్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ఆ పాత్రని తమిళంలో విజయ్ చేస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ తో చేయించడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో అమెరికాలో ఉన్న చరణ్.. ఇండియా తిరిగి రాగానే కలిసి ఈ పాత్ర గురించి నేరేట్ చేయనున్నాడట అట్లీ. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం RC15 లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/