Dasara Review: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని హిట్ కొట్టాడా.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
చిత్రం: దసరా
నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా మాస్ మసాలా కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ దసరా సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. గోదావరిఖనిలో వీర్లపల్లి గ్రామం చుట్టు స్టోరి నడుస్తుంది. ఇక్కడి నుంచే కథ ప్రారంభం అవుతుంది. బొగ్గు గనులతో అక్కడ ఉన్న స్థానికులకు ఉన్న సంబంధం అనే అంశంతో చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ హయంలో మద్యపాన నిషేధ ఉద్యమం మెదలవుతుంది. దీంతో వీర్లపల్లిలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడతాయి. ఈ చిత్రంలో ధరణి పాత్రలో నాని, వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ధరణి (నాని ) తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవ పడుతూ ఉంటాడు.
తాగి గొడవపడిన ధరణికి మరుసటి రోజు వాటిని మర్చిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో సంబి ( షైన్ టామ్ చాకో )బార్ లో గొడవ పడి మరుసటి రోజు దానిని మర్చిపోతాడు. కానీ ఈ గొడవను సంబి మనసులో పెట్టుకుంటాడు. ఈ పొరపాటు వల్ల.. అతని స్నేహితుల జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయనేదే కథ. వారి కోసం ధరణి ఏం చేశాడు అన్నదే మిగతా కథ.
ఈ చిత్రంలో నాని రస్టిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా నాని ఇందులో నటించాడు. ఇక డీ గ్లామర్ పాత్రలో కీర్తీ సురేష్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే.. చాలా రకాల భావోద్వేగాలని చక్కగా పండించింది. నాని స్నేహితులుగా నటించిన వారి తమ పాత్రకు న్యాయం చేశారు. ఫస్ట్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండో భాగం కాస్త స్లోగా అనిపించినా క్లైమాక్స్ సీన్ మాత్రం అద్భుతం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వానికి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నాని యాక్టింగ్
నేపథ్య సంగీతం
ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్:
ఊహించదగ్గ కథనం
కొన్ని బోరింగ్ సన్నివేశాలు
రేటింగ్: 3.5 / 5