Site icon Prime9

Yatra 2 Teaser: అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా యాత్ర 2 టీజర్

Yatra 2

Yatra 2

 Yatra 2 Teaser: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2 టీజర్ నేడు రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే టీజర్ వైఎస్సార్, జగన్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక అంధుడు తన లాంటి వారెందరో రాజశేఖర్ రెడ్డి కొడుకు వెనుక ఉన్నారంటూ చెప్పిన మాటలతో టీజర్ ప్రారంభమయింది.

నాకు భయపడటం రాదు ..( Yatra 2 Teaser)

నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. నాకు భయపడటం రాదు అంటూ జగన్ పాత్ర అసెంబ్లీలో చెప్పిన డైలాగు అభిమానులతో కేకలు పెట్టించే విధంగా ఉంది. అదేవిధంగా దివంగత వైఎస్సార్ వ్యక్తిత్వానికి అద్దం పట్టే విధంగా మరో డైలాగ్ ఉంది. నా రాజకీయ ప్రత్యర్దులు, శత్రువులనయినా ఓడించాలనుకుంటాను కాని మీ నాయకుడిలా వారి నాశనం కోరుకోను అంటూ వైఎస్సార్ పాత్రచెప్పే డైలాగు కూడా ఉంది. డైలాగులు, చిత్రీకరణకు తగ్గట్లుగా నేపధ్య సంగీతం కూడా ఉంది. మొత్తం మీద ఈ టీజర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు విజువల్ ఫీస్ట్ గా చెప్పవచ్చు. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో జీవా, వైఎస్ భారతి పాత్రలో కేతికి నారాయణన్, చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజానె బెర్నెర్డ్ తదితరులు నటించారు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ధియేటర్లలో విడుదలవుతోంది.

Exit mobile version