Naa Saami Ranga: కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం ట్రైలర్ రిలీజయింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి మాస్ మసాలా దట్టించి ఉన్న ఈ ట్రయిలర్ సంక్రాంతి పండక్కి అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. నాగార్జున మాస్ పాత్రలో ఈజీగా నటించారు.
మాస్ హీరోగా నాగార్జున..(Naa Saami Ranga)
మలయాళంలో హిట్టయిన ‘పొరింజు మరియమ్ జోస్’కి రీమేక్ అయిన ఈ చిత్రానికి నేటివిటీకీ అనుగుణంగా మార్పులు చేసారు. గ్రామీణ నేపధ్యాన్ని ప్రధానంగా తీసుకొని కథని తయారు చేసారు. గతంలో ఈ తరహా కధలు వచ్చినప్పటికీ హీరోయిన్ పాత్రకు కూడ ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా వున్నాడా అసలు? అంటూ అల్లరి నరేష్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయింది. అలాగే నాగార్జున, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, ఫైటింగ్ సన్నివేశాలు వీటికి నేపధ్య సంగీతం ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. నాగార్జున డైలాగులు గతంలో సోగ్గాడే చిన్నినాయనను గుర్తుకు తెస్తాయి. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇద్దరివీ కీలక పాత్రలని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే నాగార్జున సింగిల్ హ్యాండ్ తో సినిమాను లాగించే విధంగా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు విజయ్ బిన్ని సంక్రాంతి ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునని మాస్ హీరోగా ప్రెజంట్ చేసినట్లు తెలుస్తోంది.మొత్తంమీద నాగ్ అభిమానులకు, సంక్రాంతి సినిమాల కోసం చూసే ప్రేక్షకులను సినిమా ఆకట్టుకునే విధంగా సాగుతుందని చెప్పవచ్చు.